సెక్స్ మార్పిడి సర్జరీ కాన్సెప్ట్: షాకివ్వబోతున్న తెలుగు హీరోయిన్!
హీరోయిన్ అదా శర్మ సంచలన పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. త్వరలో ఆమె తెరపై సెక్స్ మార్పిడి సర్జరీ చేసుకున్న మగాడి పాత్రలో కనిపించబోతున్నారు. ట్రాన్స్ జెండర్ సబ్జెక్ట్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉండబోతోంది.
'మ్యాన్ టు మ్యాన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో అదా శర్మ ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించబోతోంది. అబిర్ సేన్‌గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, అదే సమయంలో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

లింగమార్పిడి చేసుకున్న పాత్రలో
‘మ్యాన్ టు మ్యాన్' చిత్రంలో లింగమార్పిడి చేసుకున్న మగాడి పాత్రలో అదా శర్మ కనిపించబోతోంది. పుట్టకతో పురుషుడైన ఆమె లింగమార్పిడి చేసుకుని స్త్రీగా మారుతుంది. నవీన్ కస్తూరియా అదా శర్మ భర్త పాత్రలో కనిపించబోతున్నాడు.

ఫుల్ కామెడీ మూవీ
ఆదా శర్మ అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్ కస్తూరియా... ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంటాడు. స్త్రీగా మారిన ఒక మగాడిని పెళ్లాడిన అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కామెడీ ఫార్మాట్లో చూపించబోతున్నారు.

ఈ మూవీ గురించి ఆదా శర్మ ఏమంటుందంటే...
‘నా మొదటి చిత్రం ‘1920' నుంచి ‘కమాండో 2', ‘కమాండో 3' వరకు విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. తొలిసారి నేను ఒక అబ్బాయి పాత్రలో నటిస్తున్నాను.' అని అదా శర్మ వెల్లడించారు.

వినోదంతో పాటు సోషల్ మెసేజ్
నవీన్ మాట్లాడుతూ... వినోదంతో పాటు సోషల్ మెసేజ్ అందిస్తూ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ‘ఈ చిత్రం పూర్తి భిన్నమైనది. జెండర్ యాక్సెప్టెన్స్ అనేది ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ. దీన్ని ఆసక్తికరంగా మా సినిమాలో చూపించబోతున్నాం' అన్నారు.

మ్యాన్ టు మ్యాన్
‘మ్యాన్ టు మ్యాన్' చిత్రాన్ని అనుశ్రీ అబిర్ ఎంటర్టెన్మెంట్స్, వివిధ్ ఆర్ట్‌హౌస్ పతాకాలపై జై సాహ్ని, అనుశ్రీ మెహతా సంయుక్తంగా నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











