ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పేరు సంపాదించుకున్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రెండింటికీ ఉదాహరణగా నిలిచే హీరోయిన్లలో పొడుగు కాళ్ల సుందరి ఆదా శర్మ ఒకరు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలం అయింది. దీంతో అరకొరగా ఆఫర్లను అందుకుంటోంది. అయితేనేం.. సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను తన అందాలతో కనువిందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలతో రచ్చ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

 పదహారేళ్లకే ఎంటరైన ఆదా శర్మ

పదహారేళ్లకే ఎంటరైన ఆదా శర్మ

ముంబైకి చెందిన ఆదా శర్మ చదువు పూర్తయిన వెంటనే అంటే 16 సంవత్సరాలకే సినిమాల్లోకి ఎంటర్ అయింది. బాలీవుడ్‌లో వచ్చిన '1920' అనే సినిమాతో ఆదా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేట్ అయింది. దీంతో ఈ అమ్మడు అప్పుడే అందరి దృష్టినీ ఆకర్షించేసింది.

హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఎంట్రీ

హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఎంట్రీ


'1920' మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు హిందీ సినిమాల్లోనూ నటించింది. ఇక, 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరో. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో ఆకట్టుకోవడంతో వరుసగా ఆఫర్లు సొంతం అయ్యాయి.

అలాంటి మూవీలు.. భారీ హిట్

అలాంటి మూవీలు.. భారీ హిట్


కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఆదా శర్మ.. 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత అదే తరహాలో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని ఎంచుకుంది. ఇందులో భాగంగానే 'క్షణం' చేసి భారీ హిట్‌ను అందుకుంది.

 అలాంటివి చేస్తోన్న ఆదా శర్మ

అలాంటివి చేస్తోన్న ఆదా శర్మ


గతంలో మాదిరిగా ఇప్పుడు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆదా శర్మ.. మిగిలిన వాటిపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను చక్కగా నడుపుకుంటోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా


కెరీర్ తొలినాళ్లలో ఆదా శర్మ చాలా స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే, కొన్నేళ్లుగా అంత వేగంగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఈ క్రమంలోనే తన ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపుతోంది. కొద్ది రోజులుగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆదా ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకుంటోంది.

అందాలతో కనువిందు చేస్తూ

అందాలతో కనువిందు చేస్తూ


కొద్ది రోజులుగా ఆదా శర్మ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను గుళ్ల చేస్తోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె పొట్టి డ్రెస్‌లలో ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే అందాలతో కనువిందు చేస్తూ దిగిన ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

గ్లామరస్ ఫొటోలు వదిలింది

గ్లామరస్ ఫొటోలు వదిలింది


సోషల్ మీడియాలో మితిమీరిన హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్న ఆదా శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఒకటి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఇందులో ఆదా ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించడమే. జుట్టుతో ఎద భాగాన్ని కవర్ చేసినా.. ఈ పిక్‌కు మాత్రం నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X