Aditi Rao - Siddharth : అదితిని సిద్ధార్ధ్ ఎలా పడేశాడంటే?.. అబ్బాయిలూ మీకోసమే!
గతేడాది చిత్ర పరిశ్రమకు, అభిమానులకు షాకిచ్చారు అదితి రావ్ హైదరి - సిద్ధార్ధ్. వీరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తూనే ఉండగా తమ బంధం బయటపెట్టింది ఈ జంట. ఇక కొన్నాళ్లుగా జరుగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ గతేడాది అదితి మెడలో మూడు ముళ్లు వేశారు సిద్ధార్ధ్. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పెళ్లిపీటలెక్కి.. ఆ తర్వాత తీరిగ్గా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో జనం షాక్ అయ్యారు.
గతంలోనే ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. ఇక సిద్ధార్ధ్‌కైతే చాలా మందితో ఎఫైర్లు ఉన్నాయి. అలాంటిది సిద్ధార్ధ్ ఏం చెప్పి అదితిని పడేశాడంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకప్పుడు వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజ కుటుంబానికి అదితి వారసురాలన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందే సత్యదీప్ మిశ్రాను అదితి పెళ్లాడారు. దాదాపు పదేళ్ల పాటు సాగిన వీరి బంధానికి 2012లో తెరపడింది.

సిద్ధార్ధ్ విషయానికి వస్తే 2003లోనే మేఘన అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా , అయితే వ్యక్తిగత కారణాలతో 2007లో మేఘన - సిద్ధార్ధ్ విడిపోయారు. తర్వాత సిద్ధార్ధ్ పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించాడు. శృతిహాసన్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఆయన జీవితంలోకి స్టార్ హీరోయిన్ సమంత వచ్చింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, శ్రీకాళహస్తి ఆలయంలో జంటగా పూజలు కూడా నిర్వహించారు. రేపో మాపో పెళ్లి అనగా సిద్ధార్ధ్ - సమంతకు బ్రేకప్ జరగడం చిత్ర సీమలో కలకలం రేపింది.
ఇకపోతే.. అదితితో సిద్ధార్ధ్ పరిచయం మహా సముద్రం అనే సినిమాతో మొదలైంది. షూటింగ్ సమయంలో ఇంటి నుంచి స్పెషల్ వంటకాలను తీసుకురావడంతో పాటు కలివిడిగా ఉండటం వంటి వాటితో సిద్ధార్ధ్ ఆమెకు బాగా నచ్చేశాడు. ఈ బంధం క్రమంగా ప్రేమగా మారింది. అదితి రావుకి హైదరాబాద్‌లోని వాళ్ల అమ్మమ్మ నడిపే స్కూల్ చాలా స్పెషల్. ఓ రోజును సిద్ధార్ధ్ - అదితిలు అక్కడికి వెళ్లగా.. అక్కడే మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేయగా అప్పటికప్పుడే తన అంగీకారం తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
సిద్ధూ ప్రపోజ్ చేసిన తాలూకా ఫోటోను అదితి పంచుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా 2024 తనకు తీపి జ్ఞాపకాలను అందించిందని చెబుతూ సిద్ధూతో ఉన్న ఫోటోలు, తమ పెళ్లి వీడియో, హీరామండిలో నటనను గుర్తు చేసుకుంది. అందులో సిద్ధార్ధ్ మోకాళ్లపై కూర్చొని ఓ స్పెషల్ రింగ్ పట్టుకుని అదితి రావ్‌కు ప్రపోజ్ చేస్తున్న వీడియో ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











