‘ఆమాత్రం దానికి పెళ్లి అవసరమా? కావాలంటే సహజీవనం బెటర్'

ఇండస్ట్రీలో తరుచుగా సినీ తారల పెళ్లిళ్లు, రిలేషన్‌షిప్‌లపై వార్తలు వస్తుంటాయి. కాస్త చనువుగా వేరే వ్యక్తి మెదిలితే చాలు. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమార్స్ వస్తుంటాయి.ఈ తరుణంలో పెళ్లి అవసరమా? అంటూ వివాహ వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ స్టార్ హీరోయిన్.'సంతోషంగా ఉండటానికి పెళ్లి తప్పనిసరి కాదు... అవసరమైతే లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ బెటర్' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పెళ్లిపై ఇంత బోల్డ్‌గా స్పందించిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఆమె మరెవరో కాదు.. సౌత్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తుంది. గతేడాది 'థగ్ లైఫ్' వంటి భారీ చిత్రంలో నటించిన ఈ భామ, ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన 'సంబరాల ఏటిగట్టు' అనే పీరియడ్ డ్రామాలో నటిస్తోంది. ఇటు టాలీవుడ్, అటు మాలీవుడ్ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది. అయితే , తాజాగా ఐశ్వర్య లక్ష్మి పెళ్లి విషయంలో చాలా భిన్నంగా స్పందించారు. ఈ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Actress Aishwarya Lekshmi on Marriage Live-In Is Better Than Marriage for Happiness

ఐశ్వర్య లక్ష్మి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.'నాకు జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామి కావాలి, అది నిజమే. కానీ పెళ్లి అనే బంధంలోకి వెళ్లాలని లేదు' అన్నారు. తాను చూసిన వివాహాల్లో నిజంగా సంతోషంగా ఉన్న జంటలు చాలా తక్కువగా కనిపించాయని తెలిపారు. పెళ్లి తర్వాత భాగస్వాముల మధ్య తరుచు విభేదాలు వస్తాయనీ, వాటి వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌పైనా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. అందుకే పెళ్లి అనేది జీవితానికి తప్పనిసరి కాదని అంటున్నారు.

అయితే ఐశ్వర్య లక్ష్మి పూర్తిగా బంధాలను తిరస్కరించడం లేదు. 'నాకు జీవిత భాగస్వామి కావాలనే కోరిక ఉంది. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు' అని ఆమె అన్నారు. ఇద్దరి మధ్య అవగాహన, గౌరవం, నమ్మకం ఉంటే చాలు అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన చూస్తే.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ బెటర్ అంటూ.. పెళ్లి వల్ల వచ్చే బాధ్యతలు, ఒత్తిళ్ల కంటే... సహజీవనం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడం సులభమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు తాను కూడా పెళ్లి గురించి కలలు కన్నానని, మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ కూడా పెట్టానని ఐశ్వర్య వెల్లడించారు. కానీ కాలక్రమేణా తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. జీవితంలో సంతృప్తి, ఎదుగుదల కోసం పెళ్లి అవసరం లేదని గ్రహించానని తెలిపారు. ప్రస్తుతం తాను కెరీర్‌పై దృష్టి సారించనని పేర్కొన్నారు. ఐశ్వర్య లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ 'ఇది కొత్త తరం ఆలోచన' అంటుంటే, మరికొందరు మాత్రం 'పెళ్లి విలువ తగ్గించడం సరైంది కాదు' అని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X