స్కిన్ టోన్ పై అలాంటి కామెంట్స్.. స్పందించిన ఐశ్వర్య రాజేష్!
యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా కోలీవుడ్లో ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఐశ్వర్య రాజేష్ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ' రాంబంటు' చిత్రంలో బాలనటిగా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం 1995లోనే రిలీజ్ కావడం విశేషం. అప్పటినుంచి ఐశ్వర్య రాజేష్.. చిత్రపరిశ్రమలో యాక్టివ్గానే కనిపిస్తోంది.
తెలుగు కుటుంబానికి చెందిన ఐశ్వర్య రాజేష్ తమిళ చిత్రాల్లో 2010 నుంచి 2020 వరకు యాక్టివా సినిమాలు చేశారు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఇక టాలీవుడ్ లోకి 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక తర్వాత ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తెలంగాణ యాస భాషలతో నాచురల్ గా యాక్ట్ చేసి అలరించింది. ఆ తర్వాత నుంచి ఐశ్వర్య రాజేష్ కు తెలుగులోనూ మంచి ఆఫర్లు అందాయి.

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రంతోను బ్యాక్ టు బ్యాక్ బిగ్ స్క్రీన్ పై కనిపించి సందడి చేసింది. ఇక రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ' సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. మరిన్ని ప్రాజెక్టును కూడా ఓకే చేసే పనిలో బిజీగా ఉంది.
అయితే ఐశ్వర్య రాజేష్ ఇటు సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. మరోపక్కల ఇంటర్వ్యూ లోను తను పాల్గొంటూ ఎలాంటి మామోమాటం లేకుండా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే వస్తుంది. అయితే ఐశ్వర్య రాజేష్ తన కెరీర్ బిగినింగ్ నుంచి తన స్కిన్ టోన్ పై పలు కామెంట్లను ఎదుర్కొంటూనే వస్తుంది. నాచురల్ అందంతో, సెటిల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు ఈ విషయంలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే తన స్కిన్ టోన్ పై ఐశ్వర్య రాజేష్ తాజాగా స్పందించినట్టు తెలుస్తోంది. తన స్కిన్ టోన్ వైట్ అయినా బ్లాక్ అయినా ప్రాబ్లం ఏమీ లేదని. ఆ రెండింటికి మధ్యలో తన స్కిన్ టోన్ ఉంటుందని చెప్పింది. వంటి రంగు ఎలా ఉన్నా సమస్య కాదని, పైగా అది తన నేటివ్ ప్లేస్ నుంచి వచ్చిన రంగు కాబట్టి గర్వంగా ఉందంటూ చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా ఐశ్వర్య రాజేష్ స్పందించడంతో తన స్కిన్ టోన్ పై పలు సందర్భాల్లో వస్తున్న కామెంట్లకు చెక్కు పెట్టింది. ఐశ్వర్య రాజేష్ మాత్రం చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా పాత్రను మాత్రమే తన ద్వారా చూపెడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.


Click it and Unblock the Notifications











