అందాలన్నీ ‘బజార్’లో పెట్టేసిన ఆలియా.. కోటు విప్పేసి ఊహించని విధంగా!
ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది అక్కడ పెద్ద పెద్ద రేంజ్‌కు ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో సీనియర్ ఫిల్మ్ మేకర్ మహేశ్ భట్ కుమార్తె ఆలియా భట్ ఒకరు.
చాలా తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో హవాను చూపింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆలియా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

చిన్నప్పుడే.. స్టార్ హీరోయిన్
చిన్న వయసులో ఉన్నప్పుడే ఆలియా భట్ 'సంఘర్ష్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. దీని తర్వాత ఆమె వరుసగా ఎన్నో చిత్రాలు చేసి స్టార్‌గా మారింది.

స్టార్ హీరోతోనే లవ్ మ్యారేజ్
ఏకధాటిగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనే ఆలియా భట్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా ఐదేళ్ల పాటు ఇద్దరూ లవ్ ట్రాక్ నడిపించారు. ఈ క్రమంలోనే వీళ్లు ఎప్పుడో పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదరలేదు. దీంతో 2022 ఏప్రిల్ 14వ తేదీన ఆలియా భట్, రణ్‌బీర్ పెద్దల సమక్ష్యంలో ఒక్కటయ్యారు.

తల్లైన బ్యూటీ.. ఫుల్ బిజీగా
ఆలియా భట్ ఈ మధ్య కాలంలో వరుసగా 'గంగూబాయి కతియావాడి', 'RRR', 'డార్లింగ్స్', 'బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాలతో వచ్చింది. అయితే, వివాహం జరిగిన వెంటనే ప్రెగ్నెంట్ అయిన ఈ బ్యూటీ గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక, ఆలియా, రణ్‌బీర్ జంట తమ కూతురికి ఈ సినీ జంట 'రాహా' అనే పేరును పెట్టారు.
హాలీవుడ్‌లోనూ.. అందులో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తల్లైన తర్వాత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తోంది. ఇలా గత ఏడాదిలో ఈ భామ 'Rocky Aur Rani Kii Prem Kahaani' అనే బాలీవుడ్ మూవీతో పాటు 'Heart of Stone' అనే హాలీవుడ్ మూవీలోనూ నటించింది. ఇక, ఇప్పుడు ఆలియా భట్ 'Jigra' అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగా
దాదాపు దశాబ్దానికి పైగా వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తున్నప్పటికీ.. ఆలియా భట్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.
అందాలను ఆరబోస్తూనే
ఆలియా భట్ సోషల్ మీడియాలో ఆరంభం నుంచే చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా ఈ భామ ఇదే కంటిన్యూ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఆలియా భట్ పేరు సెన్సేషన్ అవుతోంది.

ఆలియా ఫొటోలు వైరల్
ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తోన్న ఆలియా భట్ తాజాగా 'బజార్' మ్యాగజైన్ కోసం కొన్ని ఫొటోలు దిగింది. వాటిని తాజాగా సోషల్ మీడియాలో వదిలింది. వీటిలో ఈ అమ్మడు కోటు విప్పేసి లోదుస్తులు లేకుండా విపరీతంగా షో చేస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆలియా షేర్ చేసిన ఫొటోలు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











