పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమలా పాల్.. ,చిన్నారి పేరు ఏమిటో తెలుసా?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అమలా పాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్తను ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించారు. అయితే అలస్యంగా ఆ వార్తను మీడియాకు అందజేయడం గమనార్హం. అమలాపాల్ పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారు? చిన్నారి ఎప్పుడు పుట్టారు? అనే వివరాల్లోకి వెళితే..
అమలా పాల్ తన మొదటి వివాహం బ్రేకప్ అయిన తర్వాత సింగర్ జగత్ దేశాయ్‌తో అఫైర్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తొలుత ఈ వార్తలపై మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత వార్తలకు అనుగుణంగా క్లారిటీ ఇచ్చింది. జగత్ డేటింగ్ నిజమేనని ఆమె వెల్లడించారు.

అయితే అమలాపాల్ మాత్రం సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొని తన అభిమానులకు షాకిచ్చారు. అమలాపాల్, జగత్ ఇద్దరు గతేడాది 23న వివాహం చేసుకొన్నారు. అయితే తన అభిమాన తారకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె వైవాహిక జీవితం సవ్యంగా సాగాలని కోరుకొన్నారు. వివాహం జరిగిన కొద్ది నెలలకే గర్బవతిని అని ప్రకటించారు.
అయితే అమలాపాల్ జూన్ 11వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్ుట ఆమె ప్రకటించారు. ఆమె తన బిడ్డను చేతుల్లో పెట్టుకొస్తున్న వీడియో వైరల్ అయింది. దాంతో ఆమెకు, చిన్నారికి అభిమానులు విషెస్ అందజేశారు. అయితే ఆ చిన్నారికి ఇలాయి (ILAI) అని పేరు పెట్టినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications