ఒళ్లో బిడ్డను పెట్టుకుని, పబ్లిక్‌గా అతనికి లిప్‌లాక్ .. బన్నీ హీరోయిన్‌ని ఏకిపారేస్తోన్న నెటిజన్లు

భారత్‌లో సినిమా ఒక మతమైతే సినీతారలు ఇలవేల్పులు. తమ అభిమాన నటీనటుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణాలు తీయడానికి అభిమానులు సిద్ధంగా ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో వ్యక్తిపూజ, అభిమానం వంటివి కాస్త ఎక్కువ. అభిమాన నటీనటులకు ఏకంగా ఆలయాలు కట్టి పూజలు చేసిన చరిత్ర ఇక్కడి వారి సొంతం. సమాజంపై ఇంతటి ప్రభావం చూపే సినీ తారలు ఏం చేసినా, ఒకటికి పదిసార్లు ఆలోచించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మలయాళ ముద్ధుగుమ్మ అమలాపాల్ వివాదంలో ఇరుక్కుంది.

హీరో హీరోయిన్ల వస్త్రధారణ, స్టైల్, లుక్స్‌, ఆటాపాట అన్నింటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు అనుకరిస్తూ ఉంటారు. విజయశాంతి లీడ్ రోల్‌లో చేసిన కర్తవ్యం సినిమా స్పూర్తితో ఎంతోమంది అమ్మాయిలు పోలీస్ ఉద్యోగాల వైపు మళ్లారు. చిరంజీవి ఛాలెంజ్, స్వయంకృషి వంటి సినిమాలు చూసి .. జీరో నుంచి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న యువత ఎంతోమంది.

actress amala paul enjoying romantic mood with husband photos goes viral

ఇదిలాఉండగా.. 2009లో నీలాతామర చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అమలాపాల్.. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఒకటి అరా సినిమాలు తీసిన అమలాపాల్ ఆ తర్వాత ఎందుకో టాలీవుడ్‌ను పక్కనపెట్టి.. తన చూపును తమిళ్, మలయాళ ఇండస్ట్రీలపై పెట్టింది.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడిన అమలాపాల్ అతనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్ధల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంది. దాదాపు ఆరేడు సంవత్సరాలు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. తోడును వెతుక్కుంది. ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడ్డ ఆమె పెద్దల అంగీకారంతో అతనిని పెళ్లాడింది. ఈ ఏడాది ప్రారంభంలో తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

సినిమాలతో పాటు వివాదాల్లోనూ నిలిచారు అమలాపాల్. మొన్నామధ్య ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌కు పొట్టి బట్టలు వేసుకుని రావడం వివాదాస్పదమైంది. దేవాలయం వంటి కళాశాలకు కాస్త పద్దతిగా రావాలని నెటిజన్లు చురకలంటించారు. ఆ డ్రెస్‌లో తాను కంఫర్ట్‌గానే ఉన్నానని.. వాస్తవానికి తన దుస్తుల కంటే, ఆ ఫోటోలు తీసినవారిదే అసలు సమస్య అని ఆమె కౌంటరిచ్చారు. తాజాగా అమల మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. ఓనమ్ పర్వదినాన్ని ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న అమల దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్రెడిషనల్ డ్రెస్సులో కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని బాబు ఫేస్‌ను రివీల్ చేశారు అమల. అక్కడి వరకు బాగానే ఉంది అయితే భర్తకు లిప్‌లాక్ కిస్‌లు పెట్టుకుంటూ అమల ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇవి కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ఏకీపారేస్తున్నారు. పండుగ పూట ఇవేం పాడు పనులంటూ మండిపడుతున్నారు. మరి దీనిపై అమలాపాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: onam 2024 amalapaul
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X