Amala Paul: రెండో భర్త గురించి స్టార్ హీరోయిన్ పోస్ట్.. పెళ్లిరోజున ఊహించని ట్విస్ట్..

Amala Paul: సోషల్ మీడియా వాడకం పెరిగేకొద్దీ.. సినీ సెలబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావాలని, తెగ ఆరాటపడుతున్నారు. నిత్యం తమ ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది తారలు తమ గ్లామర్ షో తో ఫాన్స్ ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ తమ అందాలను ఆరబోస్తుంటారు. వాటి వారిలో సౌత్ ఇండియన్ బ్యూటీ అమలా పాల్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన భార్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. మీరూ కూడా లుక్కేయండి!

సౌత్ ఇండియన్ బ్యూటీ, హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమ్మడు 'ప్రేమ ఖైదీ' సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి 'లవ్ ఫెయిల్యూర్' అనే సినిమాలో నటించి, మెప్పించింది. ఇక ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో తెలుగు కూడా ఆఫర్లు క్యూ కట్టాయి.

Actress Amala Paul is celebrating her wedding anniversary with husband Jagat Desai her post viral

మరోవైపు తమిళ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంది. ఈ తరుణంలో కోలీవుడ్ స్టార్స్ ధనుష్, విజయ్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇండస్ట్రీ లో మంచి పాపులారిటీ రావడంతో.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అమలాపాల్ తన కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే.. ఆమె ఓ సినిమాలో న్యూడ్ గా నటించి ప్రేక్షకులకు షాకిచ్చింది. ఈ మూవీ తమిళ,తెలుగు కు విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ నెటిగివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక కెరీర్ లో మంచి ఫామ్ లో ఉండగానే.. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.దీంతో సినిమాలకు దూరమైంది. కానీ, వీరి వివాహ బంధం మూడునాళ్ళ ముచ్చటగా మారింది. కేవలం 3 ఏళ్లలో విడిపోయారు. విడాకుల అనంతరం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే.. గత ఏడాది స్నేహితుడు, వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ను కేరళలోని కొచ్చిలో రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఈ ఏడాది జూన్‏లో కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఇళయ్. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.

Actress Amala Paul is celebrating her wedding anniversary with husband Jagat Desai her post viral

తాజాగా అమలాపాల్ తన భర్తతో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. 'ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. ఈ సంవత్సరం కుమరకోమ్‌లో జరిగిన మరపురాని ఆశ్చర్యం, ప్రతిరోజూ ప్రేమను సజీవంగా ఉంచే వ్యక్తిని కలిగి ఉండటం నా అదృష్టం అని నాకు గుర్తు చేసింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టం' ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోంది. నువ్వు ఇచ్చే సర్‌ప్రైజ్‌లు జీవితాంతం గుర్తుంటాయి ' అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.

More from Filmibeat

Read more about: amala paul kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X