అమలా పాల్ అందాల సునామీ: అతి చిన్న డ్రెస్‌లో ఆ కవ్వింపు చూశారంటే!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడం వల్ల సినిమాల్లో పద్దతిగా కనిపించిన చాలా మంది హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొందరు గతంలో ఎప్పుడూ చూపించిన విధంగా అందాలను ఆరబోస్తున్నారు. అందులో అమలా పాల్ ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి మంచి పాత్రలతో మెప్పించిన ఈ అమ్మడు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ మధ్యన డోస్ పెంచేసి మరీ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమలా పాల్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
అలా ఎంట్రీ.. తెలుగులో షాక్: టీనేజ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత చాలా తమిళ చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. కానీ ఇది నిరాశ పరిచింది. ఆ తర్వాత అమలా తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి చిత్రాలను చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు కలిసి రాలేదు.

డైరెక్టర్‌కు డివోర్స్.. స్పీడుగా: వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కెరీర్‌కు పూర్తిగా విరామం తీసేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడికి అమల విడాకులు ఇచ్చేసింది. అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని జెట్ స్పీడుతో ముందుకు వెళ్తోంది.
ఆ సినిమాతో సంచలనంగా: భర్తకు విడాకుల ఇచ్చిన తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన అమలా పాల్ 'నగ్నం/అడై' అనే సినిమాతో సంచలనంగా మారింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో హిట్లు ఉన్నా లేకున్నా నటిగా మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా ఆమె కెరీర్ సాఫీగా సాగిపోతోంది.
వరుసగా మూవీలు, సిరీస్‌లే: గత ఏడాది అమలా పాల్ తమిళంలో 'కడవర్', 'ది టీచర్' అనే తమిళ సినిమాల్లో నటించి యమ అలరించింది. అలాగే, ఇటీవలే మలయాళంలో 'క్రిస్టోఫర్' మూవీతో వచ్చింది. ఇప్పుడు 'ద్విజ', 'ఆడుజీవితం'తో పాటు తమిళంలో 'అదో అంధ పరవాయి పోలా' వంటిచి చేసింది. అలాగే, బాలీవుడ్ మూవీ 'భోళా'లో తళుక్కున మెరిసి హిందీ ప్రేక్షకులనూ పలకరించింది.

అందులో మాత్రం యాక్టివ్: ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ అమలా పాల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.
గ్లామర్ డోస్ పెంచుతోంది: హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో అమలా పాల్ పెద్దగా హాట్ షో చేయలేదు. కానీ, ఈ మధ్యనే ఆమె తన శైలిని పూర్తిగా మార్చుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అమల తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ రెచ్చిపోతోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

స్విమ్మింగ్ ఫొటోలు వదిలి: తాజాగా అమలా పాల్ సోషల్ మీడియాలో కొన్ని స్విమ్మింగ్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె పింక్ కలర్ టూ పీస్ బికినీ వేసుకుని అందాలను ఆరబోస్తోంది. అంతేకాదు, చిత్ర విచిత్రమైన ఫోజులు పెడుతూ రెచ్చగొడుతోంది. దీంతో అమలా పాల్ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











