పొట్టి డ్రెస్సులో కాలేజీకా? ఇచ్చిపడేసిన అమలాపాల్
భారత్‌లో సినిమా ఒక మతమైతే తారలే దేవుళ్లు. తమ అభిమాన నటీనటుల పట్ల పూనకాలు తెచ్చుకునేంత ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువ. అభిమాన తారలకు ఏకంగా ఆలయాలు కట్టి పూజలు చేసిన చరిత్ర ఇక్కడి వారి సొంతం. ఇక వారి పుట్టినరోజు నాడు , కొత్త సినిమాల రిలీజ్ నాడు పండుగ వాతావరణం నెలకొంటుంది. రక్తదానం, అన్నదానాలు, ఇతర సేవా కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఫ్యాన్స్.
సినీనటులు సమాజంపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. హీరో హీరోయిన్ల వస్త్రధారణ, స్టైల్, లుక్స్, ఆటాపాట అన్నింటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు అనుకరిస్తూ ఉంటారు. అందుకే వారి ఏం చేసినా , ఏం మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలని నిపుణులు చెబుతుంటారు. విజయశాంతి లీడ్ రోల్‌లో చేసిన కర్తవ్యం సినిమా స్పూర్తితో ఎంతోమంది అమ్మాయిలు పోలీస్ ఉద్యోగాల వైపు మళ్లారు. చిరంజీవి ఛాలెంజ్ చూసి .. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న యువత ఎంతోమంది. ఇక వాణిశ్రీ సినిమాల్లో పెట్టుకున్న బొట్టుబిళ్లలు, చీరలు, జడకొప్పులు, వాచ్, గాజులు ఒకతరాన్ని ప్రభావితం చేశాయి. అలాంటిది తన చేతలతో వివాదంలో చిక్కుకున్నారు కేరళ కుట్టి అమలాపాల్.

2009లో నీలాతామర చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అమలాపాల్.. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడిన అమలాపాల్ అతనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్ధల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్‌తో ప్రేమాయణం సాగించి పెద్దల అంగీకారంతో అతనిని పెళ్లాడింది. ఈ ఏడాది ప్రారంభంలో తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించిన ఆమె.. గత నెలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
గర్భం దాల్చినప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు అమలాపాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ లెవెల్ క్రాస్ అనే చిత్రంలో నటించగా.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో అమల చురుగ్గా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే కేరళలోని ఎర్నాకులం నగరంలోని ఓ కాలేజీలో నిర్వహించి ఈవెంట్‌లో ఆమె హాజరవ్వగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా బాగానే ఉంది కానీ.. అమలాపాల్ వేసుకొచ్చిన పొట్టి డ్రెస్సు వివాదానికి కారణమైంది. విద్యాసంస్థలలో జరిగే ఈవెంట్స్‌కి కాస్త పద్ధతిగా రావాలని.. ఇలాంటి వేదికలపై విద్యార్ధులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో అమలాపాల్ స్పందించారు. ఆ డ్రెస్‌లో తాను కంఫర్ట్‌గానే ఉన్నానని.. వాస్తవానికి తన దుస్తుల కంటే, ఆ ఫోటోలు తీసినవారిదే అసలు సమస్య అని ఆమె వ్యాఖ్యానించారు. తాను మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రాదాయ దుస్తులను కూడా ధరిస్తానని.. అయితే సదరు డ్రెస్‌లో నేను వెళ్లడం వెనుక అసలు ఉద్దేశం విద్యార్ధుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకేనని అమలాపాల్ వెల్లడించారు. తనను ఆ దుస్తుల్లో చూడటానికి విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యంగా అనిపించలేదని ఆమె పేర్కొన్నారు. మరి అమలాపాల్ వివరణతోనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











