లవర్‌తో రెచ్చిపోయిన అమలా పాల్.. పెళ్లికి ముందే అతడితో ఘాటు రొమాన్స్
చిత్ర రంగానికి సంబంధించి సెలెబ్రిటీలు ఏం చేసినా వార్తే అవుతుంది. అలాంటిది వాళ్ల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు అయితే సంచలనంగా మారుతుంటాయి. ఇలా ఇప్పుడు తన రెండో పెళ్లి వార్తతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది ప్రముఖ హీరోయిన్ అమలా పాల్. చాలా కాలంగా సింగిల్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అమలా పాల్ తనకు కాబోయే వాడితో కలిసి రొమాన్స్ చేస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!
చాలా చిన్న వయసులోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని మూవీలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత అమలా తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' వంటి చిత్రాలను చేసి సౌతిండియా మొత్తంలో స్టార్‌గా హవాను చూపింది.

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అమలా పాల్ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత విజయ్ కుటుంబంతో అమలా పాల్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో వీళ్ల మధ్య దూరం పెరిగిపోయింది. ఫలితంగా పెళ్లైన కొంత కాలానికే ఈ సినీ జంట విడాకులు తీసుకుంది.
విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన శైలిని కూడా మార్చుకుని జెట్ స్పీడుతో సినిమాలు చేస్తోంది. ఇలా ఇప్పుడు చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె రెండో పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో రెండు రోజుల క్రితమే అమలా పాల్ తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇచ్చిన పార్టీకి హాజరైన ఆ కుర్రాడు.. అందరి ముందే అమలా పాల్‌కు ప్రపోజ్ చేశాడు. దీనికి ఈ హీరోయిన్ కూడా పచ్చజెండా ఊపేసింది. అలా అందరి సమక్షంలో జగత్ రింగు తొడిగేశాడు.
ఎంగేజ్‌మెంట్ చేసుకుని సర్‌ప్రైజ్ చేసిన అమలా పాల్.. తన కాబోయే భర్త జగత్ దేశాయ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో వీళ్లిద్దరూ రొమాంటిక్‌గా కనిపిస్తూ ఫోజులు ఇచ్చారు. ఒక పిక్‌లో అయితే అమలా పాల్ తన ఫియాన్సీకి ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. దీంతో ఈ ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉండగా.. అమలా పాల్ ఈ ఫొటోలు షేర్ చేస్తూ.. 'పార్టీలో మొదలైన ఈ హ్యాపీనెస్‌ను జీవితకాలం పంచుకోబోతున్నాం' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు అమలా పాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక, ఆమె ఇప్పుడు తమిళంలో పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











