Amala Paul అందాల అరాచకం: బాబోయ్ ఇదే దారుణం సామీ!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించేలా నటన.. ఆశ్చర్య పరిచే హావభావాలతో దక్షిణాది మొత్తంలోని ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోంది ప్రముఖ హీరోయిన్ అమలా పాల్. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే సౌతిండియా మొత్తంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

అయితే, టాలీవుడ్‌లో మాత్రం అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అమలా పాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని చూసేయండి!

టీనేజ్‌లోనే మొదలైన ప్రయాణం

టీనేజ్‌లోనే మొదలైన ప్రయాణం

టీనేజ్‌లోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' మూవీలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు కలిసి రాలేదు.

డైరెక్టర్‌తో పెళ్లి... బ్రేకప్ చెప్పింది

డైరెక్టర్‌తో పెళ్లి... బ్రేకప్ చెప్పింది

దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

నగ్నంగా అమల.. నేషనల్ రేంజ్

నగ్నంగా అమల.. నేషనల్ రేంజ్

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. కానీ, విడాకుల తీసుకున్న తర్వాత మాత్రం వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది.

ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగానే

ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగానే

టాలీవుడ్‌లో మంచి సక్సెస్ అందకపోవడంతో అమలా పాల్ వేరే భాషల మీదనే ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వేరే ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్‌ అయింది. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సినిమాల మీద సినిమాలు.. వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో తరచూ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో అమలా పాల్ పెద్దగా గ్లామర్ షో చేయలేదు. అన్నింట్లోనూ దాదాపుగా డీ గ్లామర్ పాత్రలే చేసింది. కానీ, ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌నే ఊపేస్తోంది. దీంతో వార్తల్లో నిలుస్తోంది.

అమల బెడ్ ఫొటోలు వైరల్‌గా

అమల బెడ్ ఫొటోలు వైరల్‌గా

సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం స్లీవ్‌లెస్ గౌన్ మాత్రమే కనిపించింది. అంతేకాదు, దీన్ని కూడా కిందకు జరిపేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X