twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    45 ఏళ్ళ వయసులో బద్రి హీరోయిన్ బికినీ డోస్.. మామూలుగా రెచ్చిపోవడం లేదుగా..

    |

    వయసుకి అందానికి ఏ మాత్రం సంబంధం లేదు అనేలా కొంతమంది హీరోయిన్స్ ఊహించని లుక్స్ తో దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నటీమణులు నేటితరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అందాల ప్రదర్శనతో షాక్ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక అలాంటి వారిలో బద్రి హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఉన్నారు. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా ఆమె గ్లామర్ డోస్ అస్సలు తగ్గడం లేదు. రీసెంట్ గా గోవా వెకేషన్ లో ఆమె బికినీలో కనిపించింది. అందుకే సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫొటోలపై ఒక లుక్కేస్తే..

    బద్రి సినిమాతో

    బద్రి సినిమాతో

    పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా బద్రి సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్స్ అమీషా పటేల్, రేణు దేశాయ్. ఇక ఈ సినిమా అనంతరం అమీషా పటేల్ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఆమె ఎలాంటి పాత్రలు చేసినా కూడా మొదట్లో బాగానే క్లిక్ అయ్యాయి.

    మొదటి సక్సెస్ తోనే..

    మొదటి సక్సెస్ తోనే..

    బద్రి సినిమా అనంతరం అమీషా పటేల్ బాలీవుడ్ లో కూడా కాంటిన్యూగా ఛాన్స్ లు అందుకుంది. అప్పట్లో చాలా వేగంగా రెమ్యునరేషన్ పెంచిన హీరోయిన్ గా కూడా అమీషా పటేల్ మంచి క్రేజ్ ను అందుకుంది. ఒకే ఒక్క ఏడాదిలో వరుసగా నాలుగు ఏళ్లకు సరిపోయేంత సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. బెస్ట్ హీరోయిన్ గా మొదట్లోనే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

    వరుస డిజాస్టర్స్

    వరుస డిజాస్టర్స్

    ఇక బద్రి సినిమా అనంతరం మళ్ళీ మూడేళ్లకు నాని సినిమాతో అమీషా తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు - ఏస్.జే.సూర్య కలయికలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ - బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహుడు సినిమా అయితే మరింత దారుణంగా ప్లాప్ అవ్వడంతో అమీషా పటేల్ క్రేజ్ తెలుగులో ఒక్కసారిగా డౌన్ అయ్యింది.

    హిందీలోనే బిజీగా..

    హిందీలోనే బిజీగా..

    చివరగా బాలకృష్ణతో చేసిన పరమ వీర చక్ర కూడా బెడిసికొట్టింది. గత కొంతకాలంగా హిందీలోనే అమీషా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. మళ్ళీ ఆమె మరో తెలుగు సినిమా చేయలేదు. ఆ మధ్య ఒక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి మాయమైంది. ఇక ఎక్కువగా అయితే అమీషా హిందీలోనే బిజీ అయ్యే విధంగా అడుగులు వేస్తోంది.

    బికినీ ఫొటోస్ వైరల్

    బికినీ ఫొటోస్ వైరల్

    ఇక గత కొంతకాలంగా అమీషా పటేల్ సోషల్ మీడియాలో గ్లామర్ తో ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ముఖ్యంగా బికినీ డోస్ అయితే అంతకంతకు పెంచుతూనే ఉంది. ఇటీవల గోవాలో అమీషా ఇచ్చిన స్టిల్స్ కూడా నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి. 45 ఏళ్ళ వయసులో కూడా ఆమె నేటితరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా కనిపిస్తోంది.

    వెబ్ సీరీస్ లలో..

    వెబ్ సీరీస్ లలో..

    ఇక ప్రస్తుతం అమీషా పటేల్ కొన్ని హిందీ ప్రాజెక్ట్ లలో తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తోంది. వీలైనంత వరకు పాత్రలు అన్ని కూడా డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తున్న అమీషా వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకి ఆసక్తిని చూపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో అమీషా ఇంకా ఎలాంటి లుక్స్ లో దర్శనమిస్తుందో చూడాలి.

    English summary
    Actress Ameesha patel latest bikini photos viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X