పెళ్లికాకుండానే అమీ జాక్సన్ తల్లిగా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హాట్ హీరోయిన్
బ్రిటీష్ సంతతికి చెందిన బాలీవుడ్ నటి అమీ జాక్సన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి అమీ జాక్సన్ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వార్తను షేర్ చేశారు. గత కొద్దికాలంగా జార్జ్ పనాయిటూతో సహజీవనం చేస్తున్న ఈ అందాల తార పెళ్లి కాకుండానే తల్లి కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

చిన్నారికి అమీ దంపతుల స్వాగతం
నవజాత శిశువుకు అమీ జాక్సన్ దంపతులు స్వాగతం పలుకుతూ.. తన ప్రపంచంలోకి ప్రవేశించిన మా ఎంజెల్ ఆండ్రియాస్‌కు ఘన స్వాగతం అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు. హాస్పిటల్‌లో బెడ్‌పై చిన్నారిని కౌగిలిలో చేర్చుకొని ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

లక్ష్మీరాయ్, ఇషా రెబ్బా విషెస్
అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంపై సినీ తారలు లక్ష్మీరాయ్, ఇషా రెబ్బా స్పందించారు. ఇంకా ఇన్స్‌టాగ్రామ్‌లో సందేశాలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డకు జన్మనిచ్చినట్టు పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే 50 వేలకు పైగా లైకులు రావడం గమనార్హం.

బిజినెస్‌మెన్‌తో అమీ జాక్సన్ డేటింగ్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటూతో కొంత కాలంగా అమీ జాక్సన్ డేటింగ్ చేస్తున్నది. 2019 జనవరి 1 తేదీన వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. జాంబియాలో సంధ్యా సమయంలో ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అని అమీ జాక్సన్ పేర్కొన్నారు.

అనుకోకుండా గర్భం
అయితే మా మధ్య అనుకొకుండా కొన్ని సంఘనలు జరిగాయి. ఆ క్రమంలోనే నేను గర్భం దాల్చాను. అలా ఊహించని సంఘటనతో బిడ్డకు జన్మనిస్తున్నానని అమీ జాక్సన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. వచ్చే ఏడాది గ్రీస్‌లో జరిగే గ్రాండ్ వేడుకలో జార్జ్‌ను వివాహం చేసుకొనేందుకు అమీ జాక్సన్ ప్లాన్ చేసింది.

అమీ జాక్సన్ సినీ కెరీర్
మద్రాసుపట్టణం అనే చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమీ జాక్సన్ వరుస చిత్రాలతో ఆలరించింది. సింగ్ ఈజ్ బ్లింగ్, థెరీ, ఐ, 2.0 చిత్రాల్లో నటించింది. తెలుగులో ఎవడు చిత్రంలో నటించి మెప్పించింది.


Click it and Unblock the Notifications











