For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాషన్‌ షోలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: వామ్మో ఇదేం డ్రెస్‌రా నాయనా!

  |

  చాలా కాలం వరకూ సినిమాల్లో నటించడం వల్లే హీరోయిన్లు తరచూ హైలైట్ అవుతూ ఉండేవాళ్లు. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా మారిపోయింది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా.. ఇందులో యాక్టివ్‌గా ఉంటే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఫారెన్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ అమీ జాక్సన్ ఒకరు. వేరే దేశం నుంచి వచ్చినా ఇండియాలో పలు చిత్రాలతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, ఈ మధ్య అనుకోకుండా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీ జాక్సన్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

   ఫారెన్ బ్యూటీ ఇక్కడ పాపులర్

  ఫారెన్ బ్యూటీ ఇక్కడ పాపులర్


  ప్రపంచ వ్యాప్తంగా మోడల్‌గా గుర్తింపు పొందిన అమీ జాక్సన్‌ హాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. ఈ సమయంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా భారతదేశంలోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాలతో మరింత పాపులర్ అయిపోయింది.

  బీచ్‌లో లోదుస్తుల్లో యాంకర్ స్రవంతి రచ్చ: తడిచిన అందాలతో ఘోరంగా!

  డేటింగ్‌.. ప్రెగ్నెంట్.. కెరీర్ బ్రేక్

  డేటింగ్‌.. ప్రెగ్నెంట్.. కెరీర్ బ్రేక్


  ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్ గర్భం దాల్చింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ కెరీర్‌కు బ్రేక్ తీసుకుంది.

  తల్లైన అమీ... పెళ్లి వద్దనుకుని

  తల్లైన అమీ... పెళ్లి వద్దనుకుని


  బాయ్‌ఫ్రెండ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. మూడేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు తల్లైంది. ఎంగేజ్‌మెంట్ జరిగి, తల్లై చాలా కాలమే అవుతోన్న ఆమె మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని అమీ జాక్సన్ కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగమ్మాయి అందాలు చూస్తే అంతే!

  మళ్లీ ప్రేమలో పడిన హీరోయిన్

  మళ్లీ ప్రేమలో పడిన హీరోయిన్


  జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేయడం.. ఓ బిడ్డకు తల్లవడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పడంతో అమీ జాక్సన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఆమె బ్రేకప్ గురించి అందరూ మర్చిపోతోన్న సమయంలోనే.. మరోసారి డేటింగ్ వార్తలతో అమీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు దొరికిపోయింది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


  సోషల్ మీడియాలో అమీ జాక్సన్ ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో ఆమె తన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

  నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

  అందాలను ఆరబోస్తోన్న అమీ

  అందాలను ఆరబోస్తోన్న అమీ


  ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న అమీ జాక్సన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, అంతెందుకు బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ట్రెండింగ్ అవుతోంది.

  ఫ్యాషన్ షోలో హాట్ ట్రీట్ ఇస్తూ

  ఫ్యాషన్ షోలో హాట్ ట్రీట్ ఇస్తూ


  టాలీవుడ్ మాజీ హీరోయిన్ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఒకటి ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో తీసింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ చూసి అంతా షాక్ అయ్యేలా ఉంది. అలాగే, మరో దానిలో అందాలను ఆరబోసింది. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్ అయిపోయాయి.

  English summary
  Famous actress and a former model Amy Jackson Very Busy in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X