మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. పెళ్తైన రెండు నెలలకే బేబి బంప్..

ప్రముఖ స్టార్‌ హిరోయిన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. తన సెకండ్‌ బేబీ బంప్‌ ఫోటోస్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ఓ బిడ్డను కన్న ఈ బ్యూటీ ప్రస్తుతం మరో బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా ఆ బ్యూటీ భర్తతో కలిసి దిగిన బేబీ బంఫ్‌ ఫోటోలను నెట్టింట్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో ఓ లూక్కేయండి.

ఆ హీరోయిన్ ఎవరో కాదు. బ్రిటన్ మోడల్ ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు తమిళ్ హిందీ భాషా చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తొలుత కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మద్రాసి పట్నం అనే సినిమాతో సిల్వర్ స్కీన్ పై కనిపించింది. ఆ తర్వాత ఏక్ దివానా అనే సినిమాతో అటు బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది. అనంతరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Actress Amy Jackson is expecting another child She shared photos of her baby bump just two months ago

అనంతరం ది విలన్ అనే కన్నడ మూవీ లో నటించి శాండిల్ వుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన ఐ, రోబో 2. o' లకు మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇలా తెలుగు తమిళ్ హిందీ భాషలలో ఈ నటి .. తన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఇటీవల తన ప్రేమ పెళ్లి ప్రెగ్నెన్సీ వంటి వ్యక్తిగత జీవిత విషయాలతో వార్తల్లో నిలుస్తుంది.

బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ మొదట .. బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ తో సహజీవనం చేసింది. 2011 నుండి 2012 వరకు వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ రిలేషన్ బ్రేక్ అయింది. అనంతరం పారిశ్రామికవేత్త జార్జ్ పనాయిటూతో తో 2015 నుండి రిలేషన్ ప్రారంభించింది. వీరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. సడన్ గా 2011లో వాళ్ళ రిలేషన్కు బ్రేక్ పడింది. ఆరేళ్ల తమ లీవింగ్ రిలేషన్ షిప్ కు ముగింపు పలికారు. ఆమె తన మాజీ భాగస్వామి జార్జ్ పనాయోటౌ నుంచి దూర‌మ‌య్యాక తన కొడుకుడని తానే పెంచుకుంటుంది.

Actress Amy Jackson is expecting another child She shared photos of her baby bump just two months ago

ఇక సహజీవనం వర్కవుట్ కావడం లేదని భావించిన అమీ జాక్సన్ .. తాజాగా ఇంగ్లీష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ ను పెళ్లి చేసుకుంది. ఆగస్ట్ లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో జరిగింది. పెళ్లి అయినా తరువాత కేవలం రెండు నెలలకే ఈ బ్యూటీ భర్తతో కలిసి దిగిన బేబీ బంఫ్‌ ఫోటోలను నెట్టింట్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోస్‌లో అమీ తెల్లని గౌను ధరించింది. ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వీరికి విషేస్ చెప్పుతున్నారు.

More from Filmibeat

Read more about: amy jackson bollywood ed westwick
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X