అనుకోకుండా కడుపు... నా ప్రియుడిపై నమ్మకముంది..పెళ్లికాకుండా తల్లి కావడంపై అమీ జాక్సన్

రోబో 2.0, ఎవడు చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన అమీ జాక్సన్ సంచలనానికి, వివాదానికి కేంద్ర బిందువయ్యారు. గత కొద్దికాలంగా బ్రిటన్ సంపన్నుడు జార్జ్ పనాయిటూతో డేటింగ్ చేస్తున్న అమీకి ప్రియుడితో జనవరి 2019లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అంతలోనే అమీ జాక్సన్ గర్భం దాల్చడం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి కాకుండానే గర్బం దాల్చిన వార్తలపై ఇటీవల అమీజాక్సన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

నాకు 15 వారాల గర్బం

నాకు 15 వారాల గర్బం

బ్రిటన్‌కు చెందిన మ్యాగజైన్‌తో అమీ జాక్సన్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను 15 వారాల గర్బవతిని. అక్టోబర్ నెలలో తొలి శిశువు పుట్టే అవకాశం ఉంది. ఇది నాకు ఓ రకంగా ఆశ్చర్యం కలిగించే వార్త. మాకు ఇలా జరుగుతుందని ఊహించలేదు. మేము ప్లాన్ చేసుకోకుండానే అలా జరిగిపోయింది అని అమీ జాక్సన్ వెల్లడించింది.

నా ప్రియుడిపై నమ్మకం ఉంది

నా ప్రియుడిపై నమ్మకం ఉంది

నా కాబోయే భర్త, ప్రియుడితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. మాకు మంచి ఏదో, చెడో ఏదో అంతా తెలుసు. మా మధ్య విడదీయలేని బంధం ఉంది. మా మధ్య బంధం ఎలాంటిదో తెలిపేందుకు మాకు పుట్టబోయే బిడ్డ సాక్ష్యంగా నిలుస్తుంది అని అమీ పేర్కొన్నారు.

 మాతృత్వ అనుభూతిని పొందేందుకు

మాతృత్వ అనుభూతిని పొందేందుకు

మాతృత్వ అనుభూతిని పొందడానికి ఉవ్విల్లూరుతున్నాను. నా కెరీర్‌ను, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తాను. నాకు కెరీర్, గుర్తింపు చాలా అవసరం. భవిష్యత్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. బిడ్డ సంరక్షణపై దృష్టిపెడుతూనే సినిమాలు చేస్తుంటాను అని అమీ జాక్సన్ తెలిపింది.

మార్చి 31న అమీ ప్రకటన

మార్చి 31న అమీ ప్రకటన

తాను గర్భం దాల్చినట్టు మార్చి 31న సోషల్ మీడియా ద్వారా అమీ జాక్సన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. నేను తల్లిని కాబోతున్నట్టు ఎలుగెత్తి చాటాలని, గట్టిగా అరిచి చెప్పాలనే కోరికతో ఉన్నాను. నేను తల్లి కావడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అని అమీ జాక్సన్ అన్నారు.

 2020లో గ్రీస్‌లో వివాహం

2020లో గ్రీస్‌లో వివాహం

అమీ జాక్సన్, అండ్రియాస్ జనవరి 1 తేదీన జాంబియాలో నిశ్చితార్థం చేసుకొన్నారు. 2020 సంవత్సరంలో గ్రీస్‌లోని మైకాన్స్ ఐలాండ్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. కానీ అనుకోకుండా పెళ్లికి ముందే అమీ జాక్సన్ గర్భం దాల్చడం జరిగింది. అండ్రియాస్‌ ఎబిలిటీగ్రూప్‌ వ్యవస్థాపకుడు. లగ్జరీ హోటళ్ల బిజినెస్‌ను ఆయన నిర్వహిస్తుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X