బేబీ బంప్ ఫోటోలతో శృతిమించిన స్టార్ హీరోయిన్ .. దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్
ఇటీవలి కాలంలో ఫోటో కల్చర్ బాగా ఎక్కువైంది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, మెహందీ, సంగీత్ , బారసాల, పెళ్లి ఇలా ఏ కార్యక్రమాన్ని వదిలిపెట్టడం లేదు. ఇక పెళ్లయి గర్భం దాల్చిన వివాహితలు బేబీ బంప్, బేబీ షవర్ ఈవెంట్స్ అంటూ స్పెషల్ ఫోటో షూట్స్ పెట్టిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఒకరిని చూసి మరొకరు ఇలా ఫోటో షూట్‌లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేస్తున్నారు.
ఇక హీరో హీరోయిన్ల గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గర్భం దాల్చిన హీరోయిన్లు కూడా తమ బేబీ బంప్ , బేబీ షవర్ ఫోటో షూట్‌లతో హల్ చల్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం శృతిమించినట్లుగా అనిపిస్తోంది. ఈ కోవలోకే వస్తారు రోబో 2 ముద్దుగుమ్మ అమీ జాక్సన్. రెండోసారి తల్లి కాబోతున్న ఈ అమ్మడు చేసిన బేబీ బంప్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌కు చెందిన అమీ జాక్సన్ 31 జనవరి 1992న డగ్లస్‌లో జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడల్‌గా అవతారమెత్తిన అమీ.. మిస్ టీన్ లివర్‌పూల్, మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ కాంటెస్ట్‌లలో విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో మిస్ టీన్ వరల్డ్ కాంటెస్ట్‌లోనూ కిరీటం దక్కించుకున్నారు. అనంతరం మిస్ లివర్‌పూల్ (2010), మిస్ ఇంగ్లాండ్ (2010)లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో భారతీయ సినీరంగం నుంచి అమీ జాక్సన్‌కు పిలుపొచ్చింది. తొలుత ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటించిన మద్రాస్ పట్టణం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
ఆపై తెలుగు, కన్నడ, హిందీ భాషల నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో ఎవడు, అభినేత్రి అనే సినిమాలో నటించగా.. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఐ (మనోహరుడు) సినిమా అమీ జాక్సన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత రోబో 2.0, క్రాక్, మిషన్ చాప్టర్ 1 సినిమాలలో నటించారు. వ్యాపారవేత్త జార్జ్ పనయోటుతో కొన్నాళ్లు డేటింగ్ చేయగా.. ఆ సమయంలో గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జార్జ్‌తో విడిపోయాక ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడ్డ అమీ జాక్సన్ ఆయనను గతేడాది పెళ్లాడారు.
పెళ్లయి రెండు నెలలు కూడా కాకముందే అమీ జాక్సన్ తాను గర్భం దాల్చినట్లు శుభవార్త చెప్పారు. గర్భవతి కావడంతో సినిమాలకు దూరమైన అమీ జాక్షన్ డెలివరీ తర్వాత తిరిగి ఇండియన్ స్క్రీన్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అమీ జాక్సన్ గత కొద్దిరోజులుగా తన బేబీ బంప్‌తో ఫోటో షూట్స్ నిర్వహిస్తూ వాటిని షేర్ చేస్తున్నారు. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకున్న ఆమె.. దానికి హోమ్ బాడీ క్లబ్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే వీటిపై నెటిజన్లు మిశ్రమంగా కామెంట్స్ పెడుతున్నారు. వైరల్ అవుతోన్న ఈ ఫోటోలను మీరూ చూడండి.


Click it and Unblock the Notifications











