అర్ధ నగ్నంగా హీరోయిన్ మసాజ్: అమీ జాక్సన్ సెల్ఫీ వీడియో వైరల్
నటనకు ప్రాంతంతో, భాషతో ఏమాత్రం సంబంధం లేదు. అందుకే ఎక్కడి వాళ్లైనా ఎక్కడైనా తమదైన అభినయంతో ప్రేక్షకులకు కట్టిపడేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోకి ఇలా చాలా భాషలకు చెందిన అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అందులో కొందరు విదేశీ ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అలా వచ్చి సౌతిండియాలోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. చాలా కాలం క్రితమే ఎంటరైన ఈ భామ.. కొంత కాలంగా సినిమాల్లో కనిపించట్లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమీ జాక్సన్ ఓ మసాజ్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ
హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలోనే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తద్వారా యమ పాపులర్ అయింది.

అతడితో డేటింగ్.. గర్భంతోనే
ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేసింది. అప్పుడే ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకుంది.

తల్లైన అమీ.. ప్రియుడికి బైబై
ప్రియుడితో డేటింగ్ చేస్తోన్న సమయంలోనే గర్భవతి అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అమీ జాక్సన్.. తన ప్రియుడు జార్జ్ పనాయొటోకు బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బిడ్డతోనే సమయాన్ని గడుపుతుంది.

ఇప్పుడు మరొకరితో లవ్ ట్రాక్
సినిమాల పరంగా ఎంత ఫేమస్ అయిందో.. జార్జ్‌తో ప్రేమాయణం సాగించడం, బ్రేకప్ చెప్పడం వల్ల అమీ జాక్సన్ మరింత హైలైట్ అయింది. ఇక, త్వరలోనే ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమీ జాక్సన్ మరొకరితో డేటింగ్ చేస్తుందని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. ఇప్పడామె ఓ నటుడితో ప్రేమలో ఉందని అంటున్నారు.

సోషల్ మీడియాలో సందడిగా
సినిమాలు చాలా తక్కువగానే చేసినా.. అమీ జాక్సన్ మాత్రం భారీ స్థాయిలో పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలా తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇప్పుడు తల్లైనా తగ్గకుండా రెచ్చిపోతోంది. దీంతో ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

మసాజ్ వీడియో వదిలిన అమీ
ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మసాజ్ చేయించుకుంటూ తీసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కనిపించింది. అంతేకాదు, తన బ్యాక్ అందాలు కనిపించేలా కూడా వీడియో చూపించింది. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











