అనన్య నాగళ్లకు బాయ్‌ఫ్రెండ్ సమస్య: ఎవడూ ఆ పని చేయట్లే.. అలా అడగడమే నా తప్పు అంటూ!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది లోకల్ అమ్మాయిలు అడుగు పెట్టారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది అనన్య నాగళ్ల ఒకరు. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ భామ.. సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఇలా కొంత కాలంగా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, అనన్య నాగళ్ల సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బాయ్‌ఫ్రెండ్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Actress Ananya Nagalla Clarity about Boyfriend

షాదీతోనే సెన్సేషన్‌గా: నటన మీద ఉన్న మక్కువతో చదువు పూర్తైన వెంటనే అనన్య నాగళ్ల యాక్టింగ్ కోర్స్‌లు పూర్తి చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ఎంటరైంది. ఇందులో ఆమె చేసిన నటనకు విశేషమైన స్పందన దక్కింది. అంతేకాదు, ఇందులో నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో ఆమెకు సైమా అవార్డు వచ్చింది.

సినిమాల్లోకి... పవన్‌తో: షార్ట్ ఫిల్మ్‌తో ఫేమస్ అయిన అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో సహజసిద్ధమైన నటనతో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య.. దివ్య నాయక్ అనే పాత్రను చేసి అలరించింది. ఈ మూవీలోనూ నటన పరంగా సత్తాను చాటుకుంది.

Actress Ananya Nagalla Clarity about Boyfriend

ఎన్నో చిత్రాలు.. హిట్లే: హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత అనన్య నాగళ్ల చాలా సినిమాల్లో నటించింది. అందులో 'ప్లేబ్యాక్' మూవీలో తనదైన నటనతో అబ్బరపరిచింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ చిన్న పాత్రను చేసింది. అలాగే, 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం' అనే చిత్రాల్లోనూ సందడి చేసింది. ఇలా ఈమె నటించిన వాటిలో చాలా సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఇక్కడా అక్కడా బిజీగా: తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల నటించిన చిత్రాల ఫలితాలను పక్కన పెడితే.. ప్రతి దానిలోనూ ఆమె తనదైన రీతిలో నటనను కనబరించింది. ఫలితంగా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీలోనూ చేస్తోంది. దీనితో పాటు మరికొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టులను సైతం ఆమె పట్టాలెక్కించేసింది.

Actress Ananya Nagalla Clarity about Boyfriend

అందులో ఫుల్ యాక్టివ్: వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా యమ బిజీగా గడుపుతోన్న తెలుగు పిల్ల అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ వెళ్తోంది.

అలా అడగడమే తప్పు: సోషల్ మీడియాలో యమ సందడి చేసే అనన్య నాగళ్ల.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు విసుగు లేకుండా బదులిచ్చింది. ఈ క్రమంలోనే ఒకరు 'ఈ మధ్ రీ రిలీజ్ అయిన దేశముదురు సినిమాలో హన్సికలా లేవు. నీకంటే హన్సికనే బాగుంది' అన్నాడు. దీనికి అనన్య 'మిమ్మల్ని క్వశ్చన్స్ అడగండి అనడమే నా తప్పు' అని నవ్వేసింది.

Actress Ananya Nagalla Clarity about Boyfriend

బాయ్‌ఫ్రెండ్ గురించి: ఈ ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో ఓ నెటిజన్ అనన్య నాగళ్లను 'నీ బాయ్‌ఫ్రెండ్ పేరు, ఐడీని రివీల్ చెయ్' అని అడిగాడు. దీనికామె స్పందిస్తూ.. 'బాయ్‌ఫ్రెండ్ అంత సీన్ లేదు భయ్యా. అందరూ నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనుకుంటున్నారనుకుంటా. అందుకే నాకు ఎవడూ ట్రై చేయడం లేదనుకుంటా. అదే ప్రాబ్లం అయిపోయింది' అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X