ఊహించని విధంగా అనన్య నాగళ్ల హాట్ షో: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హావభావాలు ఇలా అన్ని రకాలుగా ఆకర్షిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి అనన్య నాగళ్ల. అచ్చ తెలుగు అమ్మాయే అయినా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఈమె కొంత కాలంగా రెండు రాష్ట్రాల్లో తెగ హైలైట్ అవుతోంది. ఫలితంగా మరిన్ని సినిమాల అవకాశాలను సైతం దక్కించుకుంటోంది. అదే సమయంలో అనన్య నాగళ్ల సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె ఫోజులెలా పెట్టిందో మీరే చూడండి మరి!

అలా మొదలైన అనన్య ప్రస్థానం
అనన్య నాగళ్ల భద్రాద్రి జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆమె నటనలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ఈ భామ 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని అందరి దృష్టిలో పడింది.

హీరోయిన్‌గా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్
ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్‌తో టాలీవుడ్ మొత్తాన్ని అనన్య నాగళ్ల తన వైపునకు తిప్పుకుంది. దీంతో ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'మల్లేశం' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది.

పవన్ సినిమాతో రేంజ్ పెరిగింది
'మల్లేశం' మూవీ తర్వాత అనన్య నాగళ్ల పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. ఫలితంగా ఆమె డేట్స్ కోసం పెద్ద నిర్మాతలు సైతం వేచి చూశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో అనన్య అవకాశం దక్కించుకుంది. ఇందులో దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి తన క్రేజ్‌ను పెంచుకుంది.

వరుస హిట్లు.. ఫుల్‌గా అవకాశాలు
ఈ మధ్య కాలంలో అనన్య నాగళ్ల తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు మంచి పేరు దక్కింది.. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు మూవీల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో యమ బిజీగా
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.

గ్లామర్ షోతో అనన్య హడావిడిగా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ.. తెగ హైలైట్ అయిపోతోంది.

అనన్య నాగళ్ల హాట్ రీల్ వైరల్
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మరీ చిన్న గౌనుతో కనిపించి డిఫరెంట్‌గా ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు మరింత హైలైట్ అయ్యాయి. అంతేకాదు, థైస్‌ను చూపిస్తూ కూడా రెచ్చిపోయింది. ఫలితంగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











