Ananya Nagalla: అలా కనిపించాలని ఆ పార్టుకు సర్జరీ చేయించుకున్నాను.. కానీ!
అచ్చమైన తెలంగాణ అమ్మాయి.. చూసేందుకు చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఖమ్మంకు చెందిన అమ్మాయి అంటే ఎవరూ నమ్మరు. ఏ బాంబేకు చెందిన బ్యూటీలాగో కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. అనన్య నాగళ్ల. మల్లేశం సినిమాతో పాటు వకీల్ సాబ్ చిత్రంలో కనిపించి కుర్రకారు గుండెల కలల రాణిగా మారిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ షోకు హాజరై షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాను అలా కనిపించాలనుకుని ఓ పార్టుకు సర్జరీ చేయించుకున్నట్లు తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అనన్య ఏ పార్టుకు సర్జరీ చేయించుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల.. బీటెక్ చేసింది. అయితే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో అనేక ప్రయత్నాలు చేయగా.. మల్లేశం సినిమాలో అవకాశం దక్కించుకుంది. అలా 2019లో మల్లేశం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అద్భుతమైన నటన కనబర్చింది. ఆ తర్వాత ప్లే బ్యాక్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలోనూ కనిపించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

ఇవి మాత్రమే కాకుండా.. మాస్ట్రో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లోనూ నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో అద్భుతమైన హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దెయ్యాలను చూస్తూ భయపడే పాత్రలో కనిపించబోతున్న అనన్య.. తన సినిమా తంత్ర కోసం విపరీతమైన ప్రమోషన్లు చేస్తుంది. అందుకే ఒంటరిగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రీతూ చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ షోకు వచ్చింది. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసింది.
తాను సినిమాల్లోకి రావడానికి కారణం అలియా భట్, సమంతలు అని చెప్పుకొచ్చింది. తన ఫేవరెట్ హీరోయిన్లు వాళ్లే అని వివరించింది. అలాగే తనకు హర్రర్ చిత్రాలు అంటే చాలా భయం అని.. తంత్ర సినిమా చేసిన తర్వాత నుంచి తనకు అన్నీ అలాంటి డ్రీమ్స్ యే వస్తున్నాయని చెప్పుకొచ్చింది. మీరు కూడా జాగ్రత్త నాతో అంటూ వివరించింది. ఆ తర్వాత ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అని రీతా అడగ్గా.. ఎవరైనా ఆమె పేరు చెప్పండిరా.. నాకు గుర్తు లేదంటూ కామెంట్లు చేసింది. అలా చాలా సేపు కామెండీ చేసిందీ క్యూట్ బ్యూటీ.

ఆ తర్వాత అందం కోసం చాలా మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటారు కదా.. అలా మీరేమైనా చేయించుకున్నారా అని యాంకర్ అడగ్గా.. సూటిగా సమాధానం చెప్పింది అనన్య నాగళ్ల. అవును చేయించుకున్నానని.. రెండేళ్ల క్రితమే లిప్ ఫిల్లర్ వేయించుకున్నానని క్లారిటీ ఇచ్చింది. తన పెదాలు అందంగా కనిపించాలనే అలా చేయించుకున్నానని.. కానీ ఇప్పుడు ఆ ఫిల్లర్ పోయిందంటూ వివరించింది.


Click it and Unblock the Notifications











