తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. కళ్లతోనే సమస్తం చెప్పేలా హావభావాలు.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇలా ఎన్నో రకాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలను కూడా దక్కించుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

ఆ షార్ట్ ఫిల్మ్‌తో యమ ఫేమస్

ఆ షార్ట్ ఫిల్మ్‌తో యమ ఫేమస్

సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన అనన్య నాగళ్ల.. ముందుగా నటనలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ఈ తెలుగు భామ 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని యమా ఫేమస్ అయింది.

 సినిమాలో ఛాన్స్... ప్రశంసలు

సినిమాలో ఛాన్స్... ప్రశంసలు

అందం, అభినయంతో అదరగొట్టే అనన్య నాగళ్లకు తెలుగు పరిశ్రమ నుంచి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'మల్లేశం' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. తద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.

వకీల్ సాబ్‌తో రేంజ్ పెరిగింది

వకీల్ సాబ్‌తో రేంజ్ పెరిగింది

'మల్లేశం' మూవీలో అనన్య నాగళ్ల నటనకు ప్రేక్షకులతో పాటు సినీ పెద్దలే ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది.

హిట్ చిత్రాలు.. వరుస ఆఫర్లు

హిట్ చిత్రాలు.. వరుస ఆఫర్లు

అనన్య నాగళ్ల తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ సక్సెస్‌ను అందుకున్నాయి. దీంతో ఆమెకు మంచి పేరు దక్కింది.. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు మూవీల్లో ఆమె భాగమైంది.

 సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ ఇస్తోన్న అనన్య

హాట్ ట్రీట్ ఇస్తోన్న అనన్య

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ.. ట్రెండింగ్ అవుతూనే ఉంటోంది.

చీరకట్టులోనూ అందాల వల

చీరకట్టులోనూ అందాల వల

తాజాగా అనన్య నాగళ్ల తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరకట్టులో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు మరింత హైలైట్ అవుతున్నాయి. అంతేకాదు, ఓ నాభిని చూపిస్తూ కూడా ఓ ఫొటో షేర్ చేసింది. ఫలితంగా వీటికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X