Ananya Nagalla Marriage: వకీల్ సాబ్ బ్యూటీ పెళ్లి.. వరుడి గురించి అసలు విషయం తెలిస్తే!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ల పర్సనల్ లైఫ్‌ మీదనే ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అందులోనూ నటీమణులు ప్రేమలు, పెళ్లి గురించి అందరికీ తొంగి చూడాలని ఉంటుంది. అందుకే ఇలా వార్తలు క్రియేట్ అవుతూ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది తన వివాహం గురించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ అందులో ఏముంది? మేటర్ మీరే చూడండి!

అప్పుడే అవార్డును అందుకుంది

అప్పుడే అవార్డును అందుకుంది

సినిమాల మీద ఉన్న ఆసక్తితో అనన్య నాగళ్ల నటనలో శిక్షణను తీసుకుంది. ఆ వెంటనే ఈ చిన్నది 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డు వచ్చింది. దీంతో ఈ అమ్మడు అప్పట్లోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఫేమస్ అయిపోయింది.

హీరోయిన్‌గా ఎంట్రీ... పవన్‌తోనే

హీరోయిన్‌గా ఎంట్రీ... పవన్‌తోనే

'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సహజసిద్ధమైనట నటనతో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలోనూ మంచి నటనతో మార్కులు కొట్టేయడంతో పాటు ఆఫర్లను అందుకుంది.

హిట్లు మీద హిట్లు.. లక్కీ బ్యూటీ

హిట్లు మీద హిట్లు.. లక్కీ బ్యూటీ

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అనన్య నాగళ్ల వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అందుకే చాలా వరకూ విజయాలే ఉన్నాయి. 'మల్లేశం', 'వకీల్ సాబ్' కాకుండా గత ఏడాది ఆమె 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. ఇలా ఇప్పటి వరకూ ఆమె చేసిన, కనిపించిన చిత్రాలన్నీ హిట్ అవడంతో లక్కీ బ్యూటీ అయింది.

వరుస ఆఫర్లు.. ఆ భాషల్లో కూడా

వరుస ఆఫర్లు.. ఆ భాషల్లో కూడా

అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్న అమ్మాయి కావడంతో అనన్య నాగళ్లకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె భారీ ఆఫర్లను మాత్రం దక్కించుకోలేకపోతోంది. కానీ, చిన్న చిత్రాలతో బిజీ అయింది. ఇలా ఇప్పుడు బిగ్ బాస్ సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది.

 అనన్య నాగళ్ల పెళ్లి అని వార్తలు

అనన్య నాగళ్ల పెళ్లి అని వార్తలు

తెలుగులో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనన్య నాగళ్ల.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. అలాగే, పర్సనల్ లైఫ్‌ను కూడా ట్రిప్‌లు, టూర్లతో బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనన్య పెళ్లి చేసుకోబోతుందన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. దీంతో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

పెళ్లి వార్తలపై సెటైరికల్ పోస్టు

పెళ్లి వార్తలపై సెటైరికల్ పోస్టు

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనన్య నాగళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ మేరకు తన ఖాతాలో 'నాకోసం పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్. కానీ, అతడు ఎవరో నాకు కూడా చెప్పండి. అలాగే, మర్చిపోకుండా పెళ్లి డేట్, టైమ్ కూడా నాకు వివరించండి. అలా అయితేనే నా పెళ్లికి నేను రాగలను' అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేసి ఆ వార్తలను కొట్టి పారేసింది.

పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్

పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల తన పెళ్లి గురించి చేసిన ఈ సెటైరికల్ ట్వీట్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె పెట్టిన ఈ సెటైరికల్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన దక్కుతోంది. ఆమె పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా ట్వీట్ చేసిందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం అనన్యకు మద్దతు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X