హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనే టాక్ ఉండేది. అయితే, అదంతా గతం అనే చెప్పాలి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు.
ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. అన్నీ విజయాలుగా మలచుకుని సత్తా చాటింది. దీనికితోడు అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అనన్య నాగళ్ల కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అప్పుడే పాపులర్ అయిందిగా
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది.

ఆ సినిమాతో మంచి గుర్తింపు
పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరిస్తోన్న అనన్యకు ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తిప్పేసుకుంది.

వకీల్ సాబ్‌తో మరింత క్రేజ్
'మల్లేశం' మూవీలో అనన్య నాగళ్ల చేసిన యాక్టింగ్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఇందులో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది.

వరుస చిత్రాలతో ఫుల్ బిజీ
హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

అక్కడ మాత్రం యమ బిజీ
ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో రచ్చ చేస్తూనే
చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను సైత ఊపేస్తోంది.

షార్ట్‌తో అందాలను చూపిస్తూ
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జిమ్‌లో చిన్న షార్ట్ ధరించి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఆమె తొడల అందాలు మరింత హైలైట్ అవుతున్నాయి. అలాగే, ఆమె పర్‌ఫెక్ట్ ఫిగర్ కూడా దర్శనమిస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











