Ananya Pandey: అలా చేస్తూ దొరికిపోయిన లైగర్ బ్యూటీ.. ఫొటో వైరల్!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సక్సెస్ లేకపోయినా కూడా మంచి అవకాశాలు అందుకున్న హీరోయిన్స్ లలో అనన్య పాండే ఒకరు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉండడంతో అమ్మడు బడా సంస్థల్లో క్రేజీ సినిమాలే చేసింది. కానీ దురదృష్టం వలన ఒకటి కూడా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల అనన్య పాండేకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోను చూసినవాళ్లు అనన్యకు ఇంత బ్యాడ్ హ్యాబిట్ ఉందా అని కామెంట్ చేస్తున్నారు. అనన్య ఇంతకు ఏం చేసింది అని వివరాల్లోకి వెళితే..

ఈజీగా అవకాశాలు
అనన్య పాండే సీనియర్ నటుడు చంకి పాండే కూతురు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ బ్యూటీ చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని ఆ తర్వాత మోడల్ గా కూడా అడుగులు వేసింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మోడల్ గా ఉన్నప్పుడే అందరితోనూ చాలా క్లోజ్ గా తిరిగిన అమ్మడు చాలా ఈజీగానే అవకాశాలను అందుకుంటూ వచ్చింది.

కరణ్ జోహార్ సపోర్ట్
24 ఏళ్ల ఈ బ్యూటీ మొదట 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ ద్వారా వెండితెరకు పరిచయమైంది. కరణ్ జోహార్ సపోర్ట్ చేయడం ద్వారానే అనన్య ఇండస్ట్రీలో ఒక గ్రాండ్ ఎంట్రీ అయితే దక్కింది. అయితే ఆ సినిమా మాత్రం ఈ బ్యూటీకి అంతగా సక్సెస్ ఇవ్వలేదు. ఇక తర్వాత మళ్లీ వెంటనే మరొక సినిమా కూడా చేసింది కానీ అది కూడా డిజాస్టర్ అయ్యింది.

అది కూడా నిరాశపరిచింది
అనన్య పాండే 2020లో ఖాళీ పీలి అనే ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది కూడా నిరాశపరిచింది. దీంతో ఈ బ్యూటీ కి మళ్ళీ ఆ ఏడాది ఎలాంటి ఆఫర్లు రాలేదు. ఇక 2021లో కూడా చాలా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ కరణ్ జోహార్ సపోర్ట్ తోనే ఆమె అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేసింది.

మరో డిజాస్టర్
ఇక మొత్తానికి లైగర్ సినిమాతో ఈ బ్యూటీకి ఒక అవకాశం అయితే దొరికింది. ఆ సినిమా తప్పకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఆ సినిమా కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ విధంగా అనన్య పాండేకు మరో డిజాస్టర్ ఎదురయింది.

కజిన్ పెళ్లిలో అలా..
అయితే సోషల్ మీడియాలోని గ్లామరస్ ఫోటోలతో హడావిడిగా కనిపించే ఈ బ్యూటీ మొదటిసారి ఒక పెళ్లి వేడుకలో ఒక బ్యాడ్ హ్యాబిట్ తో కనిపించడం వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన కజిన్ పెళ్లిలో అనన్య పాండే అందరూ వేడుకలు బిజీ ఉండగా సిగరెట్ తాగుతూ కనిపించింది.

స్మోకింగ్ చేస్తున్న ఫోటో వైరల్
అనన్య పాండే ఇప్పటివరకు కూడా ఈ విధంగా ఎన్నడు కనిపించింది లేదు. ఇక ఆమె స్మోకింగ్ చేస్తున్న ఫోటో బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. 24 ఏళ్ళ వయసులోనే అనన్య పాండే ఊహించని విధంగా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ అందుకుంటుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ బ్యూటీ చేతుల్లో అయితే ప్రస్తుతం మరో మూడు సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











