అంతా మునిగిపోయింది, కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా: హీరోయిన్ అనన్య

By Bojja Kumar

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో అక్కడ జనజీవనం చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో వరద బీభత్సానికి బలయ్యారు. కేరళ జల విలయం కారణంగా దిక్కుతోచని పరిస్థితులో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు, ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.

ఇల్లు వరద నాటిలో మునిగి పోవడంతో మలయాళ హీరోయిన్ అనన్య కూడా మరొకరి ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. తన పరిస్థితి వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె నటి ఆశా శరత్‌ ఇంట్లో తలదాచుకుంటున్నారు.

'భారీ వరద కారణంగా నా ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు పెరుంబవూర్‌లోని ఆశా శరత్‌ ఇంటిలో సురక్షితంగా ఉన్నాం. గత రెండు రోజులు జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని దురదృష్టకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నామని తెలిపారు.

 Actress Ananya’s house goes under water

పలు మలయాళ చిత్రాల్లో నటించిన అనన్య తెలుగులో ఆ మధ్య విడుదలైన 'అ..ఆ' మూవీలో నటించింది. ఈ చిత్రంలో ఆమె హీరో నితిన్ చెల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె మలయాళంతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X