తరుణ్ భాస్కర్‌తో రొమాన్స్‌: అనసూయ క్లారిటీ.. నా పాత్ర ఏంటంటే?

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా అనగానే సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఆ చిత్రంలో అనసూయ హీరోయిన్‌గా అనే ప్రచారం జోరుగా వినిపించింది. అయితే తాజాగా కథనం సినిమా గురించి నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం ఫిల్మీబీట్‌తో అనసూయ మాట్లాడుతూ..

 తరుణ్ భాస్కర్‌ మూవీలో

తరుణ్ భాస్కర్‌ మూవీలో

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నది నిజమే. కానీ రొమాంటిక్ పాత్ర కాదు. ఎవరితో రొమాన్స్ చేయడం లేదు. అయితే సినిమాకు చాలా ఇంపార్టెంట్‌గా ఉండే రోల్‌ను పోషిస్తున్నాను. ఆ పాత్ర తప్పకుండా నా కెరీర్‌కు మరింత దోహదపడుతుంది. అంతకంటే ఆ పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయంలో అధికారికంగా చెబుతాను అని అనసూయ చెప్పింది.

 కథనంలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర కాదు

కథనంలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర కాదు

ఇక కథనం చిత్రంలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర కాదు. క్షణం సినిమాలో మాదిరిగా ఆఫీసర్ పాత్ర చేస్తున్నారని అనుకొంటున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. ఈ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ రోల్‌ను చేస్తున్నాను. నిర్మాతలు బీ నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రను నాతో చేయించారు. ఈ సినిమాలో సోలోగా కథను నడిపించే పాత్ర లభించడం చాలా సంతోషంగా ఉంది అని అనసూయ చెప్పారు.

 సస్పెన్స్, థ్రిల్లర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా

సస్పెన్స్, థ్రిల్లర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా

కథనం మూవీ సస్పెన్స్, థ్రిల్లర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. మంత్ర ఫేమ్ దర్శకుడు రాజేశ్ నాదేండ్ల చక్కగా నా పాత్రలను డిజైన్ చేశారు. సెట్లో మంచి వాతావరణాన్ని కల్పించారు. అలాగే నా కోసం రాసిని డైలాగ్స్, నేను చెప్పిన మాటలు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. తప్పకుండా ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా ట్రైలర్ ఉంటుంది అని అనసూయ చెప్పారు.

 వేసవిలో కథనం మూవీ రిలీజ్

వేసవిలో కథనం మూవీ రిలీజ్

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపారు. కథనం చిత్రంలో అనసూయతోపాటు అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, పెళ్లి పృథ్వీ, సమీర్, ముఖ్తార్ ఖాన్, రామరాజు, జ్యోతి నటిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ కాశ్యప్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X