Anasuya Bharadwaj: పవన్ కల్యాణ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన అనసూయ..రంగమ్మత్త చెప్పిందేమిటంటే?
Anasuya Bharadwaj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఎంతోమంది నటులు, డైరెక్టర్లు ఆయనను ఓ స్పూర్తి గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు ఉన్నారు. పవర్ స్టార్ క్రేజ్ వాడుకొని సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పవన కళ్యాణ్ తో నటించడం ఎంతో అదృష్టమని భావిస్తారు. అయితే.. యాంకర్, నటి అనసూయ మాత్రం పవన్ కళ్యాణ్ తో స్పెషల్ సాంగ్ తో నటించి అవకాశం వస్తే వదులుకున్నారు. ఆ స్పెషల్ సాంగ్ లో అనసూయ నటించకపోవడానికి కారణమేంటంటే?
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ తరువాత యాంకర్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ అటు బుల్లి తెర, ఇటు వెండి తెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. అనసూయ జీవితాన్ని మలుపుతిప్పింది జబర్ధస్త్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఈ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. క్రేజ్ లో సిల్వర్ స్కీన్ పై అవకాశాలు అందుకుంది. అలా.. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్ థ్రిల్లర్ మూవీ క్షణంలో ఏసీపీ జయ క్యారెక్టర్ అనసూయ కు బ్రేక్‌ని ఇచ్చింది. ఆ తరువాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెట్ కు జీవం పోసింది అనసూయ. ఇక పుష్ప సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించింది. ప్రస్తుతం పుష్ప 2 లో కూడా లీడ్ రోల్ నటిస్తోంది.

నటి అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ ప్రేక్షకులు తనని ఎంతగానో ఆదరిస్తున్నారని, అందుకు కారణం క్షణం మూవీలో మంచి రోల్ ఇచ్చిన అడవి శేషుకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఏదో స్పెషల్ సాంగ్ లో గ్లామర్ రోల్ చేసి పాపులారిటీ సంపాదించుకోవచ్చు అన్నారు.వాస్తవానికి ఆ ఆ సమయంలో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆఫర్ వచ్చిందని, కానీ ఆ ఆఫర్ను తానే తిరస్కరించాలని చెప్పారు.
అత్తారింటికి దారేది సినిమాలోని ఇట్స్ టైం టు పార్టీ నౌ అనే స్పెషల్ సాంగ్ లో తాను ఒక్కదాన్నే నటిస్తాననీ, తనతో వేరే వాళ్లు ఉంటే తాను చేయలేరని నిర్మొహమాటంగా చెప్పానని తెలిపారు. ఆ పాటలో హీరోయిన్ సమంత, ప్రణీత, ముంతాజ్ తదితర నటులు ఉంటారని చెప్పారు. దీంతో ఆ ఆఫర్ ను వద్దని రిజెక్ట్ చేశానని తెలిపారు. తాను అప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదని, ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే వద్దని చెప్పిందని ఈ పిల్లకి ఎంత పొగరు అని ఇండస్ట్రీలో కొందరు కామెంట్ చేశారన్నారు.

కొంతమంది అయితే..'నువ్వేంటి చెప్పేది.. పవన్ కళ్యాణ్ కాలిగోటి కూడా సరిపోవు' అంటూ కామెంట్ చేశారని ఫీలయ్యారు అనసూయ. వాస్తవానికి తాను ఆ విధంగా ఆలోచించలేదని, ఆ పాటలో తాను ఒక్కదాని మాత్రమే నటిస్తాననీ చెప్పానని, అందుకు మూవీ మేకర్స్ అలా చేయడం కుదరదనీ, నెక్స్ట్ టైం అలాంటి ఆఫర్ ఉంటే ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, కొన్ని టోల్ బ్యాచులు మాత్రం తన పట్ల దారుణంగా వ్యవహరించారని బాధపడ్డారు అనసూయ. ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్ ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని, కానీ కొన్ మంది మాత్రం కావాలని కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నారని నటి అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











