దుర్గామాతగా సినీనటి నుస్రత్ జహాన్.. పేరు మార్చుకో.. లేకపోతే చంపేస్తాం యువ ఎంపీకి బెదిరింపులు
యువ బెంగాలీ హీరోయిన్, తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను చంపేస్తామని బెదిరింపులు రావడం సంచలనం రేపింది. దుర్గామాత అవతారంలో కనిపించిన యువ ఎంపీ, సినీ నటి అటు హిందు, ముస్లిం కమ్యూనిటీ వర్గాలు ఆగ్రహానికి గురవ్వడం చర్చనీయాంశమైంది. నిన్ను చంపేస్తామని కొందరు ఆమెకు హెచ్చరికలు పంపడంతో పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

ఎంపీగా మారిన సినీ నటి మతాంతర వివాహం
సినీ నటిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్న నుస్రత్ జహాన్ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. బసీర్‌హాట్ నియోజకవర్గం నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను 2019లోనే టర్కీలో ప్రేమతోపాటు మతాంతర వివాహం చేసుకొన్నారు. అయితే సెక్యులర్ భావాలు కలిగిన నుస్రత్ ప్రతీ పండుగ సమయంలో శుభాకాంక్షలు అందించడం ఆమెను సమస్యల్లోకి నెడుతున్నది.

గణేష్ పండుగ సందర్భంగా వివాదం
ప్రస్తుత సంవత్సరంలోనే గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు అందిస్తూ.. గణేష్ భగవానుడు ప్రజలకు మంచి ఆరోగ్యం, సుఖ: సంతోషాలు అందించాలని కోరుకొంటున్నాను. హ్యాపీ గణేష్ చతుర్థి. గణపతిపప్పా మోరియా అంటూ విషెస్ అందజేశారు. మతానికి అతీతంగా నుస్రత్ విషెస్ తెలియజేయడంపై కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. బదులుగా హ్యాపీ గణేష్ చతుర్థి అంటూ సందేశాలు పంపారు. అయితే కొందరు మాత్రం ఆమె తీరును తప్పటం జరిగింది.

దుర్గామాతగా కనిపించడంపై ఆగ్రహం
తాజాగా దుర్గాపూజ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుర్గామాతగా కనిపించారు. అయితే ఓ వర్గం వారు ఆమె తీరును తప్పుపడుతూ.. నీ పేరును హిందూ పేరుగా మార్చుకో అంటూ నెటిజన్లు కామెంట్లు వదిలారు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకుండా నుస్రత్ వదిలేశారు. అయితే తాజాగా ఆమెను టార్గెట్ చేసుకొని డెత్ వార్నింగ్ ఇవ్వడం వివాదంగా మారింది.
Recommended Video

నీకు మరణం ఆసన్నమైందంటూ హెచ్చరిక..
మా మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బ తీశావు. నీకు మరణం ఆసన్నమైంది జాగ్రత్త. అల్లా ఆగ్రహానికి గురి కావాల్సిందే. నీ ఒంటిని పూర్తిగా కప్పుకోవడం తెలియదా? ఛీ ఛీ ఛీ అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. దీంతో కొందరు నుస్రత్‌కు అండగా నిలుస్తూ పోటీగా ఓ కామెంట్ పెట్టారు. పవిత్ర ముస్లిం అయి ఉండి.. ఇలా కామెంట్స్ చేస్తావా? ఇలా విద్వేషపూరిత హెచ్చరికలు చేయడం సరికాదు. పై నుంచి అల్లా చూస్తున్నాడు అంటూ మరో నెటిజన్ స్పందించాడు.


Click it and Unblock the Notifications











