పెళ్లిపై సైంధవ్ హీరోయిన్ ఊహించని నిర్ణయం: దానికి అలవాటు అయిపోయా అంటూ!
సౌత్ ఇండియాలోని చాలా భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న బ్యూటీలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో ప్రముఖ సింగర్ కమ్ హీరోయిన్ ఆండ్రియా జెరోమియా ఒకరు. చాలా ఏళ్ల క్రితమే గాయనిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.
దీంతో మరింత ఉత్సాహంగా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి మరి!

సింగర్‌గా... టాలీవుడ్‌లోనూ: చిన్న వయసులోనే ఆండ్రియా జెరీమియా సింగర్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడింది. ఫలితంగా బెస్ట్ సింగర్‌గా బోలెడన్ని అవార్డులు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఆమె పాటలు పాడింది. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'బొమ్మరిల్లు', 'కింగ్', 'దడ' సహా ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది.

హీరోయిన్‌గా.. తెలుగులోకి: సింగర్‌గా ఫుల్ పాపులర్ అయిన ఆండ్రియా జెరీమియా.. 'పచ్చైకిల్లి ముత్తుచారామ్' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాల్లోనూ భాగం అయింది. ఇక, 'తడాకా' అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగు పెట్టి మంచి పేరును తెచ్చుకుంది.

ఎఫైర్లతో సంచలనంగానే: ఆ మధ్య దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన సుచీ లీక్స్‌లో ఆండ్రియా ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడితో పెనవేసుకుని ఉన్న ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేశాయి. అలాగే ఆండ్రియా పలు వివాదాల్లోనూ భాగమైంది. ఇలా ఈ అమ్మడు కెరీర్ కంటే కాంట్రవర్శీలతోనే సంచలనంగా మారిపోయింది.

వరుస సినిమాలతో బిజీ: ప్రస్తుతం ఆండ్రియా జెరీమియా ఎన్నో చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా తమిళంలో 'పిశాచు 2', 'కా', 'మాలింగై', 'నో ఎంట్రీ'తో పాటు కొన్ని పేర్లు పెట్టని సినిమాల్లోనూ భాగం అయింది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబోలో రూపొందిన 'సైంధవ్'లోనూ నటించింది. వీటితో పాటు సింగర్‌గానూ కొన్ని సినిమాలకు ఆండ్రియా పని చేస్తూనే ఉంది.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది: ఆండ్రియా జెరోమియా కొంత కాలంగా కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా తన జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు అని ఆండ్రియా జెరోమియా తేల్చి చెప్పేసింది.

దానికి అలవాటు అయ్యా: తాజా ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. 'నేనే 25 ఏళ్ల ఏజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నాకు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచనే రావట్లేదు. నేను ఒంటరి జీవితానికి అలవాటు అయిపోయాను. అందుకే ఇప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాను' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











