పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నా.. నన్ను అలా వాడుకున్నాడు: బయటపెట్టిన హీరోయిన్

గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసి.. కొంత కాలంగా హీరోయిన్‌గా కొనసాగుతోంది సౌత్ ఇండియన్ బ్యూటీ ఆండ్రియా జెరోమియా. విలక్షణ నటనకు తోడు సాహసాలు చేయడంతో ఈమె తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నో అవకాశాలను సైతం అందుకుంది.

అలా చిన్న హీరోలతో కాదు.. పెద్ద పెద్ద స్టార్లతోనూ నటించింది. తెలుగులోనూ పలు సినిమాల్లో మెరిసింది. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతోన్న ఆండ్రియా.. తాజాగా తన ఎఫైర్‌ను బయటపెట్టేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మీరు కూడా చూసేయండి మరి!

Actress Andrea Jeremiah Reveals About Her Love and Breakup Story

సింగర్‌గా ఫుల్ పాపులర్
ఆండ్రియా జెరోమియా చాలా చిన్న వయసులోనే గాయనిగా ప్రయాణం మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడింది. ఫలితంగా బెస్ట్ సింగర్‌గా బోలెడన్ని అవార్డులు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోకీ ఎంటరైంది. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'బొమ్మరిల్లు', 'కింగ్', 'దడ' సహా ఎన్నో చిత్రాలకు పాడింది.

Actress Andrea Jeremiah Reveals About Her Love and Breakup Story

హీరోయిన్.. తెలుగులోకి

సింగర్‌గా యమా క్రేజ్ తెచ్చుకున్న ఆండ్రియా జెరీమియా.. 'పచ్చైకిల్లి ముత్తుచారామ్' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాల్లోనూ భాగం అయింది. ఇక, 'తడాకా' అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగు పెట్టి మంచి గుర్తింపును అందుకుంది.

Actress Andrea Jeremiah Reveals About Her Love and Breakup Story

ఇప్పుడు ఫుల్ మూవీస్
ఆండ్రియా జెరీమియా ప్రస్తుతం ఎన్నో చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా తమిళంలో 'పిశాచు 2', 'కా', 'మాలింగై', 'నో ఎంట్రీ'తో పాటు కొన్ని పేర్లు పెట్టని సినిమాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబోలో రూపొందిన 'సైంధవ్'లోనూ నటించింది. నటిగానే కాదు.. సింగర్‌గానూ కొన్ని సినిమాలకు ఆండ్రియా పని చేస్తూ దూసుకుపోతోంది.

Actress Andrea Jeremiah Reveals About Her Love and Breakup Story

ఎఫైర్లతో సంచలనంగా

ఆండ్రియా జెరోమియా సినిమాల కంటే ఎఫైర్ల కారణంగానే సెన్సేషన్ అయింది. ఆ మధ్య సుచీ లీక్స్‌లో ఆండ్రియా ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడితో పెనవేసుకుని ఉన్న ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేశాయి. అలాగే ఆండ్రియా పలు వివాదాల్లోనూ భాగమై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Actress Andrea Jeremiah Reveals About Her Love and Breakup Story

ఎఫైర్ బయటపెట్టేస్తూ
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఆండ్రియా జెరోమియా అస్సలు తీరిక లేకుండానే గడుపుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమె ఓ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన లైఫ్‌లో జరిగిన ఎన్నో అనుకోని సంఘటనల గురించి వివరించింది. ఈ క్రమంలోనే గతంలో తాను పెట్టుకున్న ఎఫైర్‌ను ఆండ్రియా బయటపెట్టేసింది.

వేధింపులు.. డిప్రెషన్

తాజా ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. 'నేను గతంలో పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నా. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీన్ని భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా. ఆ బాధలో ఉన్నప్పుడే ఓ బుక్‌ను కూడా రాశాను. ఇప్పుడు దాని నుంచి పూర్తిగా కోలుకున్నాను' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X