Andrea Jeremiah: యుగానికి ఒక్కడు బ్యూటీ డ్రెస్ లేకుండా షాకింగ్ స్టిల్.. ఆ సైడ్ మొత్తం చూపిస్తూ..
ఆండ్రియా జెరేమియా.. ఈ పేరు గురించి సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఆండ్రియా అప్పుడప్పుడు గ్లామర్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందరికంటే భిన్నంగా ఫొటో షూట్స్ లో పాల్గొనే ఈ భామ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక షాకింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట గాయనిగా..
తమిళ సినీ పరిశ్రమలోకి సింగర్ గా ప్రవేశించిన ఆండ్రియా నటిగా కూడా మారి అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె తమిళ సినిమాల్లో నటించిన వాటిలో చాలా సూపర్ హిట్ లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యుగానికి ఒక్కడు సినిమా ద్వారా ఆమె సౌత్ లో మంచి గుర్తింపును అందుకుంది. తెలుగులో తడాఖా సినిమాలో కూడా సునీల్ కు జోడిగా నటించింది.

అలా నటిగా..
ఒక ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీలో జన్మించిన ఆండ్రియా చెన్నైలోనే పుట్టి పెరిగింది. కానీ కళల మీద ఆసక్తితో ఆమె ముందు నుంచి పాటలు పాడడం మీద దృష్టి పెట్టింది. అలా కాలేజీలో కొన్ని ట్రూప్స్ లో పాడుతూ ఉండేది. తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ లో కనిపించిన ఆమె సీరియల్ లో కూడా నటించింది. అలా సినీ నటిగా కూడా మారి అనేక సినిమాల్లో భాగమైంది.

కెరీర్ లో కాంట్రవర్సీలు
అయితే ఈ భామ గతంలో పలు సందర్భాలలో వివాదాస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కింది సూచి లీక్స్ లీకైన సమయంలో కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆమె ఒక ప్రముఖ సింగర్ తో ప్రేమలో ఉందని డేటింగ్ చేస్తోందని రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఆమె ఎప్పుడు కూడా సీరియస్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

సినిమాలతో బిజీగా
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత చాలామంది తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తారు. కానీ ఈ భామ ఎక్కువగా తమిళ మలయాళ సినిమాలే చేస్తూ వస్తోంది. ఈ భామ చేతిలో దాదాపుగా ఇప్పుడు ఆడజనుకు పైగా తమిళనాడు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్ పూర్తికాగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

అర్ధనగ్నంగా ఫొటో
ఇక ఉమెన్స్ డే సందర్భంగా అమ్మడు ఒక విభిన్నమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
మహిళగా పుట్టినందుకు గర్వించు... ఈరోజు ప్రతిరోజు... అంటూ ఆమె కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆమె ఒంటి మీద కేవలం ఒక దుప్పటిని అడ్డం పెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు ఆండ్రియా వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు ఆసక్తిని చూపిస్తోంది.


Click it and Unblock the Notifications











