మళ్ళీ రెచ్చిపోయిన తెలుగమ్మాయి అంజలి.. బ్లాక్ లింగరీలో ఎద అందాల విందు!
తెలుగు అమ్మాయి అంజలి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు కి చెందిన ఈ భామ సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్ గా మారింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ్ లో కి వెళ్లి అక్కడ ఒక ఊపు ఊపింది. హీరో జై తో ప్రేమాయణం సాగించి చర్చనీయాంశంగా మారిన అంజలి ఆ తరువాత అతనికి కొంత దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగులో అలా ఎంట్రీ ఇచ్చి
ఫోటో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అంజలి తర్వాత ప్రేమలేఖ రాశా, అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో ఆమె తన లక్ పరీక్షించుకుంది.

సీత పాత్రలో
అలా వెళ్లి తమిళంలో దాదాపు 10 సినిమాలు చేసిన తర్వాత మళ్లీ తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా చేసిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో బలుపు, గీతాంజలి, శంకరాభరణం, డిక్టేటర్, చిత్రాంగద, నిశ్శబ్దం లాంటి సినిమాల్లో నటించింది ఆమె.

చివరిగా వకీల్ సాబ్
చివరిగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన అంజలి, హీరోయిన్ గా నటించిన ఆనందభైరవి తెలుగులో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలు కాక తమిళంలో ఒక కొన్ని సినిమాలు, మలయాళం సహా కన్నడంలో ఒక సినిమాలో కూడా అంజలి నటిస్తున్నట్టు సమాచారం.

బ్లాక్ లింగరీ
అయితే సాధారణంగా సినిమాల్లో చాలా పద్ధతైన పాత్రలు చేసే అంజలి తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ లో మాత్రం రెచ్చిపోయింది.. బ్లాక్ లింగరీ వేసుకున్న ఆమె బ్లాక్ షర్ట్ వేసుకుని పైన ఒక గ్రీన్ కలర్ ఓవర్ కోట్ లాంటిది ధరించింది.. ఇక ఆమె ప్రస్తుతానికి ఏదో వెకేషన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలు షేర్ చేసిన అంజలి మీకు నచ్చిన పని చేయకపోతే నీకు అది వర్కౌట్ కాదు అంటూ కామెంట్లు కూడా పెట్టింది.
Recommended Video

వరదలా కామెంట్ లు
ఇక అంజలి షేర్ చేసిన ఈ హాట్ ఫోటోలకు పెద్ద ఎత్తున కామెంట్ లు వరదలా వచ్చి కురుస్తున్నాయి.. అటు తమిళ అభిమానులు ఇటు తెలుగు అభిమానులు కూడా అంజలి ఇంత హాట్ గా రెడీ అవడం ఏంటి అని ముక్కు మీద వేలు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అంజలి ఫోటో కి యాంకర్ విష్ణు ప్రియ కూడా సూపర్ హాట్ గా ఉన్నావు అన్నట్లు ఎమోజి షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











