సుశాంత్! అక్కడ నీ తల్లితో కలిసే ఉన్నావనుకొంటా.. మాజీ లవర్ అంకిత ఎమోషనల్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తల్లి అంటే చెప్పలేనంత ప్రేమ. తన తల్లి మరణంతో మానసికంగా కుంగిపోయారు. తన తల్లిని స్మరించుకొంటూ ఎప్పుడూ ఆమె ప్రేమలోనే బతికేవారు. పలుమార్లు తన మాతృమూర్తి గురించి తలచుకొంటూ మీడియాలో తన ప్రేమను వ్యక్తం చేశారు. అయితే సుశాంత్‌కు అమ్మ అంటే ఇంత ఇష్టమో ఆయన మాజీ ప్రియురాలు అంకితా లోఖండేకు తెలుసు. తాజాగా సుశాంత్‌ మరణం తర్వాత అంకిత ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు చూసిన తర్వాత ఎవరైన భావోద్వేగానికి గురి కావాల్సిందే. సుశాంత్‌పై అంకిత కురిపించిన భావోద్వేగం ఏమిటంటే..

ఏడేళ్లపాటు రిలేషన్‌షిప్

ఏడేళ్లపాటు రిలేషన్‌షిప్

సుశాంత్‌తో అంకిత లోఖండేకు సుదీర్ఘమైన రిలేషన్‌షిప్ ఉంది. 2009 నుంచి 2014 వరకు ప్రసారమైన డైలీ సీరియల్ పవిత్ర రిస్తాలో ఇద్దరూ కలిసి నటించారు. ఆ సందర్భంగా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. 2016 వరకు సుమారు ఏడేళ్ల పాటు వారిద్దరి మధ్య రిలేషన్ ఉంది. ఆ తర్వాత సుశాంత్‌తో విడిపోయినప్పటికీ ఆయన కుటుంబంతో ఎప్పుడూ సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. సుశాంత్ మరణం తర్వాత పాట్నాకు వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి ఓదార్చారు

సుశాంత్ పిరికివాడు కాదు

సుశాంత్ పిరికివాడు కాదు

ఇక సుశాంత్ మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సూసైడ్ చేసుకొనేంత పిరికివాడు కాదు. అంతేకాకుండా సుశాంత్‌ డిప్రెషన్‌కు గురికాలేదు. కెరీర్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే వ్యక్తి కాదు. సుశాంత్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. అవకాశం కోసం మూడ సంవత్సరాలు ఎలాంటి పని చేయకుండా వేచి చూసిన నాకు తెలుసు అని అంకిత ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు.

సుశాంత్‌ ఫ్యామిలీకి న్యాయం జరగాలి

సుశాంత్‌ ఫ్యామిలీకి న్యాయం జరగాలి

సుశాంత్ మరణం వెనుక అనేక అనుమానాలు, కొందరి సందేహాత్మక కదలికలు ఉన్నాయి. వాటన్నింటిని బయటకు తీయాలంటే సుశాంత్ మరణం కేసును సీబీఐకి అప్పగించాలి. సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. ఎప్పటికైనా నిజాలు బయటకు రాకుండా ఉండవు అంటూ తన అభిప్రాయాన్ని అంకిత వ్యక్తం చేశారు. అలాగే రియాను ఈడీ విచారణకు పిలవడంతో మేము వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది అంటూ నర్మగర్భమైన పోస్టును పెట్టారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
నీ తల్లితో కలిసే ఉన్నావనుకొంటా

నీ తల్లితో కలిసే ఉన్నావనుకొంటా

ఇలాంటి భావోద్వేగాల మధ్య అంకిత ఓ ఎమోషనల్ పోస్టును పెట్టారు. సుశాంత్‌కు ఎంతో ఇష్టమైన తల్లి గురించి అంకిత తన పోస్టులో పేర్కొన్నారు. నీవు నీ తల్లి దగ్గరికి చేరుకొన్నావునుకొంటున్నాను. మీరిద్దరు అక్కడే కలిసే ఉన్నారని భావిస్తున్నాను అంటూ సుశాంత్ తల్లి ఫోటోను పట్టుకొన్న చిత్రాన్ని తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంకిత పోస్టుకు సుశాంత్ సోదరి సమాధానం ఇస్తూ.. అవును వారిద్దరు కలిసే ఉంటారు. లవ్ యూ బేబీ.. మానసికంగా ధైర్యంతో ఉండు. న్యాయం కోసం ధైర్యంగా పోరాడుదాం అని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కృతి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X