సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ లవర్ పెళ్లి.. ఫోటోలు షేర్ చేసి షాకిచ్చిన అకింతా బ్యూటీ

టెలివిజన్‌ రంగంలో విశేషంగా ఫాలోయింగ్ సొంతం చేసుకొన్ని బాలీవుడ్‌లో రాణిస్తున్న అంకితా లోఖండే దాంపత్య జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. పెళ్లికి ముందు జరిగిన మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయంగా జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అంకితా లోఖండే తన పెళ్లి వార్తను ప్రపంచానికి తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

పవిత్ర రిస్తా సీరియల్‌తో పాపులారిటీ

పవిత్ర రిస్తా సీరియల్‌తో పాపులారిటీ

టెలివిజన్ తెరపై భారీ రేటింగ్ సొంతం చేసుకొన్న పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అకింత లోఖండే తన డేటింగ్ వ్యవహారంతో మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమ వ్యవహారం ద్వారా మరింత గుర్తింపును సొంతం చేసుకొన్నారు. పవిత్ర రిస్తా సీరియల్‌లో నటిస్తున్న సమయంలో సుశాంత్, అంకితా ప్రేమలో పడ్డారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అఫైర్

సుశాంత్ సింగ్, అంకింతా లోఖండే పీకల్లోతు ప్రేమలో మునగడంతో వారి వ్యవహారం పెళ్లి వరకు వస్తుందని ఊహించారు. కానీ సుశాంత్ మరణానికి ఏడాదికి ముందు సమయంలో వారిద్దరూ విడిపోయారు. వారి బ్రేకప్ బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే అంకితాతో తెగతెంపులు చేసుకొన్న తర్వాత రియా చక్రవర్తితో సుశాంత్ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత వీకీ జైన్‌తో అంకితా లోఖండే అఫైర్‌లో ప్రేమలో పడ్డారు.

పెళ్లి వాయిదా ఎందుకంటే?

పెళ్లి వాయిదా ఎందుకంటే?

వాస్తవానికి అంకితా లోఖండే పెళ్లి వికి జైన్‌తో ఎప్పుడో జరుగాల్సింది. కానీ కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా వారి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరకు డిసెంబర్ 12వ తేదీన ముంబైలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే పెళ్లికి ముందు జరుగుతున్న వేడుకల్లో వారిద్దరూ జోష్‌తో కనిపించారు. పెళ్లికి ముందు సంప్రదాయకంగా జరిపే కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను అంకితా లోఖండే ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

మహారాష్ట్ర సంప్రదాయాల ప్రకారం

మహారాష్ట్ర సంప్రదాయాల ప్రకారం

నా పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఇవి. పవిత్రమైన ఆన్‌వికీకాహనీ (#AnVikikahani) అంటూ హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేశారు. అంకితా గులాబి, గ్రీన్ రంగు సారీలో కనిపించగా, వికీ జైన్ తెల్లని కుర్తాను ధరించి మెరిసిపోయారు. మహారాష్ట్ర సంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా వారు పెళ్లిదుస్తులను ధరించడం గమనార్హం.

 పిక్చర్ ఇంకా బాకీ ఉందని..

పిక్చర్ ఇంకా బాకీ ఉందని..

అకింతాను పెళ్లాడబోతున్న వికీజైన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. ఇద్దరు చేతిలో చేయి వేసి అన్యోన్యంగా కనిపించారు. తన పెళ్లి గురించి మరాఠీ, హిందీ భాషల్లో అభిమానులకు మెసేజ్ పంపారు. మాకు మేము ఎంతో గాఢంగా ప్రేమలో ఉన్నాం. పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్ అంటూ మెసేజ్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X