నిర్మాత కొడుకుతో ఫస్ట్ లిప్ లాక్‌పై అనుపమ క్లారిటీ .. అందుకే ఆ సీన్స్ అంటూ..

సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండా క్యూట్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉన్నారు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా ఎక్కువగా తన యాక్టింగ్ స్కిల్స్ తోనే ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా అమ్మడు తన స్మైల్ తో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఇటీవల రౌడి బాయ్స్ సినిమాలో అనుపమ ఏకంగా లిప్ లాక్ సన్నివేశంలో నటించడంతో అందరూ షాక్ అయ్యారు.

ఆ సినిమాతో మంచి క్రేజ్..

ఆ సినిమాతో మంచి క్రేజ్..

మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో సమంత మేయిన్ హీరోయిన్ అయినప్పటికీ అనుపమ మాత్రం తన పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

రొమాన్స్ ఉంటే..

రొమాన్స్ ఉంటే..

ఇక రొమాంటిక్ సన్నివేశాలు అంటే అనుపమ ఏ మాత్రం ఒప్పుకోదని మొన్నటివరకు ఇండస్ట్రీలో అందరికి ఒక క్లారిటీ అయితే ఉండేది. ఎందుకంటే ఈ బ్యూటీ గతంలో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువైనా కూడా సినిమా చేసేందుకు ఒప్పుకోలేదని టాక్ వచ్చింది. ఆ ఆలోచనతో కొన్ని మంచి ప్రాజెక్ట్ లను కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట.

మొదటిసారి లిప్ లాక్

మొదటిసారి లిప్ లాక్

అయితే హఠాత్తుగా అనుపమ రౌడి బాయ్స్ ట్రైలర్ లో ముద్దు సీన్ లో కనిపించే సరికి అందరూ షాక్ అయ్యారు. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ముద్దు సీన్స్ లో నటించని అనుపమ ఫస్ట్ టైమ్ అలాంటి సన్నివేశాలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమాతో నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ముద్దు సీన్ చూశాక నెటిజన్ల నుంచి ట్రోల్స్ మీమ్స్ కూడా బాగానే వచ్చాయి.

క్లారిటీ ఇచ్చిన అనుపమ

క్లారిటీ ఇచ్చిన అనుపమ

ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా ముద్దు సీన్ లో అంతలా నటించడానికి కారణం ఏమిటనే విషయంపై కూడా అనుపమ తనదైన శైలిలో ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది. లిప్‌లాక్ సినిమాలో ఒక భాగం మాత్రమేనని, ఆ సినిమాలో తనను ముద్దుపెట్టుకున్నది ఆకాష్ (ఆశిష్ పాత్ర) అని చెప్పింది. సినిమాలోని ఇంటిమేట్ సీన్ చూసి నెటిజన్లు మనసు మార్చుకుంటారని కూడా ఆమె హామీ ఇచ్చింది.

రొమాన్స్ ఎక్కువగానే..

రొమాన్స్ ఎక్కువగానే..

తప్పకుండా సినిమా యూత్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. దిల్ రాజు కూడా ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. మొదటిసారి తమ బ్యానర్ లో హద్దులు దాటి రొమాంటిక్ డోస్ పెంచినట్లుగా కూడా ఓపెన్ గానే చెప్పేశారు. చూస్తుంటే రౌడి బాయ్స్ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది.

స్టార్స్ తో ప్రమోషన్స్

స్టార్స్ తో ప్రమోషన్స్

ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా తరువాత తన స్థాయిని మరింత పెంచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రౌడి బాయ్స్ సినిమా ప్రమోషన్ అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ పాటలు రిలీజ్ చేయగా.. ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక ప్రభాస్ రామ్ చరణ్ వంటి వారిని కూడా ప్రమోషన్స్ లో తెగ వాడేస్తున్నారు. మరి ఫైనల్ గా సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X