ఫస్ట్ టైమ్ అనుపమ లిప్ లాక్.. అప్పుడు రిజెక్ట్ చేసి.. ఇప్పుడు మాత్రం నిర్మాత కొడుకుతో..

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఈ బ్యూటీ అగ్ర హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కూడా తనకంటూ అభిమానులలో మాత్రం ఒక స్పెషల్ స్థానాన్ని ఏర్పరచుకుంది. చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఎవరూ ఊహించని విధంగా లిప్ లాక్ సీన్ లో కనిపించింది. ఒకప్పుడు ఒక హీరోకు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం ఉందని సినిమాను రిజెక్ట్ చేసిన అనుపమ ఇప్పుడు ఏకంగా నిర్మాత కొడుకుతో లిప్ లాక్ సీన్లలో నటించడం హాట్ టాపిక్ గా మారిందని కథనాలు వెలువడుతున్నాయి.

తెలుగు సినిమాలతో..

తెలుగు సినిమాలతో..

ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అనుపప స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అనుపమకు ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 'అఆ' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా సమంత కంటే ఎక్కువ స్థాయిలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది.

 ఆ సినిమా తరువాత

ఆ సినిమా తరువాత

అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా చిన్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకుంది. ముఖ్యంగా శర్వానంద్ తో శతమానం భవతి సినిమా అప్పట్లో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా అనుపమ పరమేశ్వరన్ కు పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం కేవలం తనకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంది.

అలాంటి సీన్స్ ఉన్నాయని రిజెక్ట్..

అలాంటి సీన్స్ ఉన్నాయని రిజెక్ట్..

అయితే ఆ మధ్య కాలంలో అనుపమ పరమేశ్వరన్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ అయితే గట్టిగానే వినిపించింది. ముందు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి సన్నివేశాలు ఉంటే చేయలేను అని వెనక్కి తగ్గినట్లుగా కథనాలు వెలువడ్డాయి. కేవలం లిప్ లాక్ సీన్ ఉండడం వల్లనే ఆమె ప్రముఖ హీరో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాక్ వచ్చింది.

రౌడి బాయ్స్ సినిమాలో..

రౌడి బాయ్స్ సినిమాలో..

ఆ రూమర్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇటీవల సీనియర్ నిర్మాత తనయుడు కొడుకుతో మాత్రం లిప్ లాక్ సన్నివేశం లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు అయిన ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న రౌడీ బాయ్స్ సినిమా జనవరి 14న రానుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇందులో మేయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

లిప్ లాక్ సీన్..

లిప్ లాక్ సీన్..

రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ చాలా రొమాంటిక్ క్యారెక్టర్లో కనిపించినట్లు అర్థమవుతోంది ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో ఆమె లిప్ లాక్ సన్నివేశం కూడా హైలెట్ గా నిలిచింది. ఇంతవరకు ఇలాంటి సన్నివేశాలలో పెద్దగా కనిపించని అనుపమ మొదటిసారి లిప్ లాక్ సీన్ లో కనిపించే సరికి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే సినిమా కాన్సెప్ట్ నచ్చినందుకే అనుపమ ఆ లిప్ లాక్ సీన్ లో నటించినట్లు మరో టాక్ వినిపిస్తోంది

పాజిటివ్ వైబ్రేషన్స్..

పాజిటివ్ వైబ్రేషన్స్..

మొన్నటి వరకు రౌడీ బాయ్స్ సినిమా పై అంతగా అంచనాలు అయితే లేవు. ఇక ట్రైలర్ ఎప్పుడైతే మొదలైందో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అంశాలు చాలానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇక జనవరి 14 వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X