Anupama Parameswaran: ప్యాంట్ వేసుకోవడం మరిచితివా అనుపాప.. ఫస్ట్ టైమ్ అలాంటి అందాలతో స్టన్నింగ్!
క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో కంటెంట్ కు తగ్గ పాత్రలో నటిస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల కాలంలో అయితే మెల్లగా గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో నెవర్ బిఫోర్ అనేలా గ్లామర్ తో హీటెక్కిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఒక ఫోటోలో అయితే ప్యాంటు వేసుకోనట్లే ఉంది.. అని అన్నట్లుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలలోకి వెళితే..

మొదట్లోనే బాక్సాఫీస్ హిట్స్
అనుపమ పరమేశ్వరన్ మలయాళం ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినప్పటికీ కూడా తెలుగులో మాత్రం మంచి గుర్తింపు అందుకుంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా మొదట్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు వచ్చాయి. మలయాళం ఇండస్ట్రీలో మొదటి సినిమా ప్రేమమ్ తోనే తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో కూడా నితిన్ అఆ సినిమాతోపాటు ప్రేమమ్, శతమానం భవతి సినిమాలతో మరింత బూస్ట్ దక్కింది.

ఆ లిమిట్స్ దాటకుండా..
2015 నుంచి సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఎక్కువగా చిన్న హీరోలతో అలాగే మీడియం రేంజ్ హీరోలతో రొమాంటిక్ లవ్ సినిమాలు చేసింది. అయితే ఆమె ఎలాంటి ప్రేమకథలు చేసిన కూడా లిమిట్స్ దాటకుండా అందులో పెద్దగా అయితే బోల్డ్ కంటెంట్ ఉండే క్యారెక్టర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోలేదు.

మొదటిసారి లిప్ లాక్
కానీ గత ఏడాది అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్ సినిమాలో మాత్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఆమె ఇంతకుముందే కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు నటించాలి అని ఆఫర్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసింది. కానీ రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం అనుపమ ఉహించని విధంగా లిప్ లాక్ సన్నివేశంలో నటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సినిమా కోసం ఆమె అత్యధిక స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది.

గత ఏడాది ఎక్కువ సినిమాలు
ఇక గత ఏడాది అయితే అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్లో అత్యధిక సినిమాలు చేసింది. రౌడీ బాయ్స్ తో పాటు కార్తికేయ 2, 28 పేజెస్, అలాగే బటర్ ఫ్లై వంటి సినిమాల్లో నటించింది. అలాగే నాని అంటే సుందరానికి సినిమాల్లో కూడా గెస్ట్ పాత్రలో కనిపించింది. ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో అయితే చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ
ఇక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె గతంలో ఎప్పుడు లేని విధంగా గ్లామర్ తో ఎప్పటికప్పుడు షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగని మరీ వల్గర్ గా కాకుండా చీరలో అయినా గ్లామర్ డ్రెస్ లో అయినా సరే అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా?
ఇక అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటోలో అయితే మరో ఘాటైన లుక్కుతో కనిపించింది. అందులో ఆమె టాప్ డ్రెస్ లో మోకాలు కనిపించేలా స్టిల్ ఇచ్చింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ లెగ్స్ అందాలతో మతిపోయేలా చేసింది. దీంతో నెటిజన్లు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అంటూ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











