ఆ బంధం విడదీయలేనిది.. అనుష్క శెట్టి పోస్టు వైరల్!
బాహుబలి ఫేమ్, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి తాజాగా తన బాల్యానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితుల ఫోటోలను కూ యాప్ ద్వారా పంచుకొన్నారు. తన స్నేహితుల ఫోటోలను షేర్ చేసి తన బాల్యంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకొన్నారు. జీవితంలో మన దారులు ఎన్నోసార్లు మారవచ్చు. కానీ స్నేహితులతో బంధం ఎవరూ విడదీయలేనంతగా చిరకాలం ఉంటుంది అని అనుష్క ఓ మెసేజ్‌ను పోస్టు చేశారు. అనుష్క శెట్టి విషయానికి వస్తే.. కూప్ యాప్‌లో ఇటీవలే చేరారు. ఆమె చేరిన వారం లోపే 25 వేలమందికిపైగా ఫాలో అవ్వడం విశేషంగా మారింది.
అనుష్క శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో టాప్ యాక్టర్‌గానే కాకుండా అత్యధికంగా ఫ్యాన్, మాస్ ఫాలోయింగ్ ఉన్న నటిగా క్రేజ్‌ను సంపాదించుకొన్నారు. బాహుబలి చిత్రంతో ఆమె దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం ఇటీవలే రిలీజై అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది.

ప్రస్తుతం అనుష్క శెట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నారు.. ఈ చిత్రంలో కవల పిల్లలకు సింగిల్ మదర్ పాత్రను పోషించనున్నారు.ఈ సినిమాకు తమిళంలో టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారనే విషయం మీడియాలో వైరల్ అయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక కూ యాప్ విషయానికి వస్తే.. మార్చి 2020లో ఈ యాప్ భారతీయ అన్ని భాషల్లో ప్రారంభమైంది. కూ వినియోగదారులు తమ మాతృభాషలో తమ భావాలను వ్యక్తికరించే విధంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ఈ యాప్‌లో భాగస్వామ్యమయ్యారు.


Click it and Unblock the Notifications











