మంచం నిండా రెండు వేల నోట్లే.. అప్సరా రాణి రచ్చ మాములుగా లేదుగా!
అప్సర రాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు ఏమో. ఎందుకంటే వర్మ సినిమాల్లో నటించి ఆమె అంత క్రేజ్ సంపాదించింది. ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే

చిన్నప్పటి నుంచీ ఆసక్తే
ఆమె 1996లో ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో మధ్యతరగతి ఒడియా హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన మరియు మోడలింగ్ పట్ల ఆసక్తి ఉండేది. అలా చాలా చిన్న వయస్సులోనే నటి కావాలని నిర్ణయించుకుంది. ఉన్నత విద్య పూర్తి చేసిన తరువాత, ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం, ఆమె టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఫోర్ లెటర్స్ ద్వారా
2019లో వచ్చిన ఫోర్ లెటర్స్ అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత నటుడు, దర్శకుడిగా మారిన సత్యప్రకాష్ తెరకెక్కించిన ఊలాల్ల ఊలాల్ల సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు తీసుకురాలేదు. కానీ ఆమెను ఈ రెండు సినిమాల్లో చూసిన వర్మ థ్రిల్లర్ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు..

అప్సరను చేసిన వర్మ
ఆ సినిమా చేయడంతో ఈ బొమ్మలో ఉన్న సెక్స్ అప్పీల్ ప్రజలందరికీ తెలిసిపోయింది. నిజానికి ఈ భామ అసలు పేరు అంకిత మహారాణా. ఉత్తరప్రదేశ్లోని డెహ్రడూన్ లో పుట్టిన ఈ భామ మొదటి రెండు సినిమాల్లో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది. దీంతో వర్మ ఆమెను చూడగానే అప్సర లాగా ఉన్నావ్ అని చెబుతూ ఆమెకు అప్సర రాణి అనే పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆ మెగా పేరు పెట్టాడో అప్పటి నుంచి ఆమెకు వరుస అవకాశాలు దక్కడం ప్రారంభమయ్యాయి.

లెస్బియన్ క్రైమ్ స్టోరీలో
ఇప్పుడు ఆమెకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆ తర్వాత క్రాక్ సినిమాలో రవితేజ సరసన భూమి బద్దలు అనే ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించి ఆమె మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఐటమ్ సాంగ్ చూసి సిటీ మార్ సినిమాలో కూడా పెప్సి ఆంటీ అనే సాంగ్ కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న డేంజరస్ అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తోంది ఈ భామ.

పరుపు మీద డబ్బుతో
తేనె కళ్లతో కవ్వించే ఈ భామ ఎప్పటికప్పుడు వర్మ అండదండలతో హాట్ ఫోటో షూట్ చేస్తూ బికినీ ఫోటోలు సైతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఈ భామ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో పై నుంచి డబ్బులు వర్షం కురుస్తుండగా ఈ భామ పరుపు నిండా 2000 నోట్లు రూపాయలు పరిచి ఉండగా దాని మీద ఎగురుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇవి నిజమైన నోట్లా? లేక షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన నకిలీ నోట్లా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











