బరిలో కాలు దువ్విన అప్సర రాణి .. పందెం రాయుళ్ల చూపంతా వర్మ బ్యూటీపైనే
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద పండుగ జరుపుకునేందుకు తెలుగువారు స్వగ్రామాలకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు అయినవారు, ఆత్మీయుల మధ్య పండుగ జరుపుకుని ఆ జ్ఞాపకాలతో తమ సొంతూళ్లను వీడారు. అయితే ఈసారి మాత్రం ఎక్కువ మంది ప్రముఖులు , సామాన్యులు ఏపీలోని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంక్రాంతి సంబరాలకు తరలివెళ్లారు. వీరిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలకు చాలా మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. కొందరు ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుని ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిపోతున్నారు. ఇలాంటి వారిలో హాట్ బ్యూటీ అప్సర రాణి కూడా ఒకరు. రామ్ గోపాల్ వర్మ హీరోయిన్‌గా ముద్రపడ్డ ఈమె తన అందంతో దూసుకెళ్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 12 జనవరి 1996న జన్మించిన అప్సర రాణి.. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లోకి దిగారు. పలు బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరించిన ఆమె.. అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టారు.

4 లెటర్స్ అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అప్సరకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ అనే సినిమాతో బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్‌తో రెచ్చిపోయి నటించింది. ఈ క్రేజ్‌తో అప్సర పేరు మారుమోగిపోయింది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ పుట్టడం, వీరి మధ్య రొమాంటిక్ సీన్స్ బ్యాక్ డ్రాప్‌తో ఆర్జీవీ తెరకెక్కించిన ఈ సినిమా వివాదాల్లోనూ చిక్కుకుపోయింది. అయినప్పటికీ అప్సర అందాలకు మాత్రం మంచి మార్కులు పుట్టాయి.
ఈ దశలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ భూమ్ బద్ధల్ సాంగ్‌తో మాస్‌ను ఊపేసింది అప్సర. క్రాక్ సినిమా ఘన విజయం సాధించడంలో ఈ పాట కూడా కీలకపాత్ర పోషించింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు నటించిన హంట్‌లోనూ పాపతో పైలం సాంగ్‌తో మరోసారి రెచ్చిపోయింది. ఇక గతేడాది తెలుగులోనే తలకోన అంటూ పలకరించింది.
తాజాగా ఆమె ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన రాచరికం త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సందేశ్ విలన్‌గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 1న రాచరికం విడుదల కానుంది. కాగా.. ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో అప్సరా రాణి పాల్గొన్నారు. ఎప్పుడూ మోడ్రన్ లుక్‌లో కనిపించే ఈ ముద్దుగుమ్మ పట్టు చీర కట్టి.. కోడి పందెల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతిలో పుంజును పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం అప్సరా రాణి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











