Don't Miss!
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- News
మంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రితో మాట్లాడతా.. పక్క జిల్లాల మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు??
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒంటరిగా రూమ్‌కు వస్తావా? డైరెక్టర్ నిర్వాకాన్ని బయటపెట్టిన యువ హీరోయిన్ అప్సర రాణి
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ రాజ్యమేలుతోందని, అవకాశాలు కావాలంటే లంగా పోవాల్సిందే అని ఇప్పటికే ఎందరో నటీమణులు ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే అంశంపై తెలుగు పాపులర్ ఐటెం భామ అప్సరా రాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ అనుభవం ఎదురైందని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె ఏం వ్యాఖ్యానించింది అనే వివరాల్లోకి వెళితే..

కన్నడ సినిమా పరిశ్రమలో
1996లో ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో మధ్యతరగతి ఒడిశా హిందూ కుటుంబంలో అంకితా మహారాణా జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన మరియు మోడలింగ్ పట్ల ఆసక్తి ఉండేది. అలా చాలా చిన్న వయసులోనే నటి కావాలని నిర్ణయించుకుంది. కర్ణాటకలోని బెల్గాంలో ఉన్నత విద్య పూర్తి చేసిన తరువాత, ఆమె కన్నడ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేసింది.

హీరోయిన్ గా ఎంట్రీ
అక్కడ ఆమెకు వర్కౌట్ కాలేదు కానీ 2019లో వచ్చిన ఫోర్ లెటర్స్ అనే తెలుగు సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత నటుడు, దర్శకుడిగా మారిన సత్యప్రకాష్ తెరకెక్కించిన ఊల్లాల ఊల్లాల సినిమాలో ఆమె ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించింది. ఆ సినిమాతో మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటే ఆమెకు ఆ సినిమా కూడా పెద్దగా అవకాశాలు తీసుకురాలేదు.

లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ లో
అయితే ఆమెకు ఈ రెండు సినిమాలు కూడా వర్మ కళ్లలో పడేలా చేసింది. అలా ఆమెకు థ్రిల్లర్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడిదాకా ఆమె పేరు అంకితా మహారాణా కాగా వర్మ ఆమెకు అప్సర రాణి అనే పేరు పెట్టారు. ఆ తరువాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆ తర్వాత క్రాక్ సినిమాలో రవితేజ సరసన భూమి బద్దలు అనే ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించి ఆమె మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఐటమ్ సాంగ్ చూసి సిటీ మార్ సినిమాలో కూడా పెప్సి ఆంటీ అనే సాంగ్ కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న డేంజరస్ అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తోంది.

కోరిక తీరిస్తేనే అవకాశం
అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అప్సర తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలను వెల్లడించింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారని చెప్పిన అప్సర ఒక సినిమా డిస్కషన్స్ కోసం దర్శకుడు రూమ్ కి ఒంటరిగా రమ్మని పిలిచాడని, తన కోరిక తీరిస్తేనే అవకాశం ఇస్తానని చెప్పిన విషయాన్ని వెల్లడించింది. అయితే తాను మాత్రం ముందు జాగ్రత్తగా అక్కడకి తండ్రిని వెంటబెట్టుకొని వెళ్లానని దర్శకుడి తీరు అర్ధం కావడంతో వెంటనే అక్కడి నుంచి వచ్చేశానని ఆమె వెల్లడించింది.

నెత్తిన పెట్టుకుంటారు
అయితే ఇలా ఒక డైరెక్టర్ చేశాడని పేర్కొంది కానీ ఆయన ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు అప్సర. తెలుగులో మాత్రం తనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని ఆమె వెల్లడించింది. టాలెంట్ ఉన్న వాళ్లకు తెలుగులో మంచి అవకాశాలే వస్తాయని.. ఒక సినిమా ఆడితే చాలు తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు అని ఆమె వెల్లడించింది.