ఆ హీరో వల్లే నా జీవితం, కెరీర్ నాశనం.. అతడు అలా నన్ను తొక్కేశాడు: నటి అర్చన షాకింగ్ కామెంట్స్

ప్రస్తుత సమాజంలో ఏ కామాంధుడు ఎటు వైపు నుంచి వచ్చి కాటేస్తాడో తెలియక మహిళలు బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నారుల నుంచి రేపో మాపో పోయే వృద్ధురాళ్ల వరకు ఈ కీచకులు వదిలిపెట్టడం లేదు. సినీరంగంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతాయని అంతా అంటూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్‌లుగా వెలుగొందుతున్న వారు సైతం ఇలాంటి వారి చేతిలో బాధితులు కావడం దురదృష్టకరం.

ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే ఆడపిల్లలు కమిట్‌మెంట్‌‌కు సిద్ధం కావాల్సిందేనని ఎంతోమంది మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీ టూ ఉద్యమం సాగినంత కాలం.. రోజుకొక ప్రముఖుడి గురించి ఆరోపణలు వినిపించేవి. స్టార్స్ చెప్పినట్లు చేయకుంటే తొక్కేస్తారని, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వారిని సంతృప్తిపరచాల్సిందేనని ఎంతోమంది ఆరోపించారు. రాను రాను ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు పెరగడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్ధితి నెలకొంది. కానీ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు.

actress Archana Shastry made sensational comments on casting couch in film industry

ఇకపోతే.. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు అంతంత మాత్రమే. అలా టాలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకున్న అచ్చ తెలుగమ్మాయి వేద శాస్త్రి అలియాస్ అర్చన శాస్త్రి. సీనియర్ దర్శకుడు సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన నేను అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేద గుడ్ లుక్స్, యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంది. నేను తర్వాత ఈమెకు వరుసపెట్టి అవకాశాలు క్యూకట్టాయి. తెలుగమ్మాయి అయినప్పటికీ కన్నడంలోనూ మంచి సినిమాలు చేసింది.

కానీ తర్వాత ఎందుకో ఈ జోరును కంటిన్యూ చేయలేకపోయింది అర్చన. దీనికి తోడు ఎక్కువ శాతం గెస్ట్ అప్పియరెన్స్ , సహాయనటి పాత్రలే రావడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొన్నిరోజులు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో తళుక్కున మెరిసింది. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. కానీ బిగ్‌బాస్ తెచ్చిన ఫేమ్ ఆమె కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించింది. ఇక తన సినీ ప్రస్థానానికి ముగింపు పలికి జీవితంలో స్థిరపడాలని భావించిన అర్చన తన ప్రియుడు జగదీశ్‌ను పెళ్లాడారు. 2019 నవంబర్ 15న హైదరాబాద్‌లో అర్చన- జగదీశ్‌ల పెళ్లి ఘనంగా జరిగింది.

actress Archana Shastry made sensational comments on casting couch in film industry

ఇటీవల మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అర్చన.. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాలో బాగా నటించానని తనకు అవార్డు వచ్చిందని.. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఓ పెద్ద హీరో వచ్చారని , అయితే తన పేరు పిలిచినప్పుడు స్టేజ్ మీదకు వెళ్లగానే సదరు హీరో నేను ఈ అమ్మాయికి అవార్డ్ ఇవ్వనని తేల్చిచెప్పి దిగిపోయారని అర్చన పేర్కొన్నారు. మరొకరు వచ్చిన తనకు అవార్డ్ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు.

తెలుగు వాళ్లు.. తెలుగు వాళ్లు అని సంకలు గుద్దుకుంటున్నామని.. కానీ మనవాళ్లని మనవారే అగౌరవపరుస్తున్నారని అర్చన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మలయాళ చిత్రం చేస్తున్న టైంలో ఓ స్టార్ హీరో తనకు మెసేజ్‌లు పెట్టేవారని, వాటికి తాను రిప్లయ్ ఇవ్వలేదని.. అమ్మకి చెబితే ఆమె కూడా బాధపడేదని అర్చన గుర్తుచేసుకున్నారు. చివరికి రిప్లయ్ ఇవ్వకపోవడంతో హర్ట్ అయిన ఆ హీరో తనను సినిమాలోంచి తప్పించాడని ఆమె తెలిపారు. అర్చన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమెకు ఆ టైప్ మెసేజ్‌లు పెట్టిన హీరో ఎవరనేది మాత్రం అర్చన వివరించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X