Actress Archana: "ఆ ఒక్క సినిమా చేయడం వల్లే నా కెరియర్ ముగిసింది.. అదొక్కటి చేయకపోతే బాగుండేది"
అర్చన.. అర్చు.. అర్చన శాస్త్రీ.. వేద.. ఇలా ఏ పేరుతో పిలిచిన టక్కున పలికే భామ అర్చన శాస్త్రీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా సనిమాల్లో కనిపించట్లేదు. కానీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ ఒక్క సినిమా చేయడం వల్లే తన కెరియర్ ముగిసిపోయిందని.. అదొక్కటి చేయకపోతే బాగుండని వివరించింది. అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ తపన అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. అయితే అదే ఏడాది అల్లరి నరేష్ హీరోగా చేసిన నేను అనే సినిమాతో హీరోయిన్ గా మారిపోయి విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, సూర్యం వంటి సినిమాల్లోనూ మెరిసింది. 2006లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో కూడా మెరిసి మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా అందులో త్రిష స్నేహితురాలు లల్లీగా కనిపించి ఎవరూ ఊహించని స్తాయిలో గుర్తింపు కొట్టేసింది.

ముఖ్యంగా కళ్లజోడు పెట్టుకుని.. చాలా క్యూట్ గా కనిపించిన అర్చనకు ఈ సినిమానే మైనస్ అయిందని చెబుతోంది. వాస్తవానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం.. ఆమెకు విపరీతమైన గుర్తింపు రావడం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమానే తన కెరియర్ స్టాప్ అయిపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన.. తన కెరియర్ విషయంలో చేసిన తప్పుల గురించి వివరించింది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేయడం వల్లే హీరోయిన్ గా తన కెరియర్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే మరో బ్లాక్ బస్టర్ హిట్టు సినిమాలో తనకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేదని కూడా వెల్లడించింది. ముఖ్యంగా తాను ఈ సినిమా ఓకే చెప్పాకా.. హీరోయిన్ గా తనను సెలెక్ట్ చేసుకున్న ఓ డైరెక్టర్ తన సినిమా నుంచి ఈమెను తొలగించారని తెలిపింది. అయితే తనను తీసేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అయిందని కూడా చెప్పుకొచ్చింది అర్చన.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో తనకు కళ్లజోడు పెట్టడం మరీ మైనస్ అయిందని... ఏ హీరోయిన్ కు అయినా, ఏ నటికి అయినా కళ్లే ముఖ్యం అని ఆ సినిమాలో తన కళ్లు, హావభావాలు సరిగ్గా కనిపించలేవని చెప్పుకొచ్చింది. ఆ సినిమా వల్లే తాను హీరోయిన్ ఛాన్స్ లు మిస్ చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఆ సినిమా చేసిన తర్వాత నుంచి తనకు అన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అవకాశం వచ్చాయని.. హీరోయిన్ గా మాత్రం ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











