అరుదుగా ఇలాంటి ఛాన్స్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో? నటి అర్చన కామెంట్

సప్త‌గిరి, వైభ‌వి జోషి జంట‌గా న‌టించిన సినిమా వ‌జ్ర‌ క‌వ‌చ‌ధ‌ర‌ గోవింద‌. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కుడు. శివ శివ‌మ్ ఫిలిమ్స్ బేనర్లో న‌రేంద్ర య‌డ‌ల‌, జీవీయ‌న్ రెడ్డి నిర్మించగా డిస్ట్రిబ్యూటర్ బ్ర‌హ్మ‌య్య ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి జూన్ 14న విడుదల చేశారు. ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సప్తగిరితో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే పాత్ర పోషించిన అర్చన మాట్లాడుతూ... ''తెలుగు సినిమాల్లో ఆడవారికి పవర్ ఫుల్ పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ పాత్రను ఈ సినిమాలో నాకు ఇచ్చారు. దానికి న్యాయం చేశాను అనుకుంటున్నాను' అన్నారు.

అందులో లీనమయ్యా

అందులో లీనమయ్యా

‘‘ఇందులో నా పాత్ర పేరు నల్లూరి ప్రసన్న లక్ష్మి. షూటింగ్ సమయంలో నిజంగానే ఆ పాత్రలో ఉన్నట్లు నాకు తెలియకుండానే లీనమైపోయాను. ఆయడిన్స్ నుంచి సోషల్ మీడియా ద్వారా చాలా మంది అప్రిషియేట్ చేస్తూ సందేశాలు పంపుతున్నారు. అర్చన ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టింది అంటున్నారు. ఇలాంటి అప్లాజ్ వస్తుంటే మరింత ఆనందంగా ఉంది' అని అర్చన చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో?

ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో?

‘‘ఎమ్మెల్యే పాత్ర చేయడం చాలా నచ్చింది అంటున్నారు... నిజ జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా?’’ అనే ప్రశ్నకు అర్చన స్పందిస్తూ ‘‘ఏమో చెప్పలేం.. అవకాశం వస్తే చేస్తానేమో?' అంటూ సమాధానం ఇచ్చారు.

లాభాలకు అమ్మారు, నిజమైన విజయం

లాభాలకు అమ్మారు, నిజమైన విజయం

షూటింగ్ చివరి దశలో ఉండగా మా నిర్మాత ఈ సినిమాను మంచి లాభాలకు అమ్మినట్లు తెలిపారు. అది మాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా శివ శివం బేనర్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నాను. సినిమా విడుదలైన తర్వాత డిస్ట్రిబ్యూటర్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది మాకు నిజమైన విజయం అని అర్చన చెప్పుకొచ్చారు.

దమ్మున్న పాత్ర ఇది

దమ్మున్న పాత్ర ఇది

ఒక ఆర్టిస్టుగా చిన్న సినిమా, పెద్ద సినిమా అని మేము చూడం. మనం చేసే పాత్రలో పెర్ఫార్మెన్స్ చేయగలిగే అవకాశం ఉండి, పాత్రలో దమ్ముంటే మాకు మంచి పాత్ర చేశామనే సంతోషం ఉంటుంది. వజ్రకవచధర గోవిందాలో అలాంటి పాత్ర చేసే అవకాశం దక్కిందని అర్చన తెలిపారు.

లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతంగా తీశారు

లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతంగా తీశారు

ఒక లిమిటెడ్ బడ్జెట్లో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఒక మంచి క్వాలిటీ ఉండే సినిమా చేశారు. దర్శకుడు అరుణ్ పవార్ ప్రతి పాత్రను ఎంతో బాగా మలిచారు. సినిమాలోని కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ముందే ఊహించాం. ముఖ్యంగా ఊర్లలో ఈ సినిమా బాగా ఆడుతుంది. జబర్దస్త్ అవినాష్ సైతం మంచి అప్రిషియేషన్ సొంతం చేసుకున్నారు. చిన్న ఊర్లలో కలెక్షన్ బావుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు... అర్చన వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X