ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదో కూడా తెలియదు.. అలా చావగొట్టాడు: వెంకటేష్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ వారి వెనకాల ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చాలా వరకు హీరోయిన్స్ కొన్ని విషయాలను బయట పెట్టడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం వారి బాధను బయటకు చెప్పుకుంటూ ఉంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం కలగకుండా ఉండదు. రీసెంట్ గా మాజీ హీరోయిన్ ఆశ సైని కూడా తనలో జీవితంలో ఎదురైనా ఎన్నో చేదు అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ నటించగా అందులో ఒక అందమైన హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఆశ సైని కనిపించింది. ఆమె గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఆ సినిమాలో ఆమె కనిపించింది కొద్దిసేపు అయినా వెంకీతో చేసిన సన్నివేశాలు చాలా బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా అందులో సాంగ్ కూడా వైరల్ అయింది. బాలకృష్ణ, రజనీకాంత్.. ఇలా అగ్ర హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది.

అసలు పేరు ఫ్లోరా సైని
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని. ఆమె చండీగర్లో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత తొందరగా ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. మొదట ఆమె ప్రేమ కోసం అనే తెలుగు సినిమాతో 1999లో వెండితెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత గ్యాప్ లేకుండా ఒక ఏడాదిలోనే పదికి పైగా సినిమాలు చేసింది. అయితే అందులో ఎక్కువగా ఆమె సైడ్ క్యారెక్టర్స్ లోనే నటించింది.

బాయ్ ఫ్రెండ్ గొడవ
కన్నడ తెలుగు సినిమాల్లో బాగా బిజీగా మారిపోయిన తర్వాత హిందీలో కూడా ఆమెకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బిజీగా కొనసాగుతున్న సైని ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన వార్తలతో మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. అతనితో ఆమె గొడవపడి మీడియాకు కూడా ఎక్కిన వార్తలు వైరల్ అయ్యాయి.

లైంగిక వేధింపులు
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సైని మాట్లాడుతూ తన బాయ్ ఫ్రెండ్ ఎంతగా నరకం చూపించాడో ఆమె ఎమోషనల్ అవుతూ తెలియజేసింది. ఇటీవల శ్రద్ధ వాకర్ హత్య కేసు విషయం గురించి మాట్లాడిన ఆమె తాను కూడా బాయ్ ఫ్రెండ్ గౌరంగ్ జోషి కారణంగా చిత్రహింసలను ఎదుర్కొన్నానని చెప్పింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కూడా ఆమెను బయటపెట్టింది.

ఒంటిపై బట్టలు ఉన్నాయో లేవో..
అతని కోసం అందరిని వదిలేసి వచ్చాను. అయినప్పటికీ కూడా నన్ను ఎంతగానో హింసించాడు. అసలు ఏ మాత్రం కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. అతని దెబ్బలకు కొన్నిసార్లు నా దవడ విరిగిపోయింది. ఒకరోజు అయితే దారుణంగా రాక్షసంగా చేయి చేసుకోవడంతో చనిపోతానని అనుకున్నాను. అతని దెబ్బలకు భయపడి నేను ఒంటిపై బట్టలు ఉన్నాయో లేవో అని కూడా చూడకుండా బయటకు పరిగెత్తాను. అనంతరం అతనిపై పోలీస్ కేసు కూడా పెట్టినట్లుగా ఆమె చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది.


Click it and Unblock the Notifications











