Avantika Vandanapu: ఆ అబద్ధం చెప్పి హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశా.. కానీ ఆ తర్వాత!
టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె... ఇటీవలే హాలీవుడ్ లో ఓ సినిమా చేయగా ఫుల్ వైరల్ అయింది. గతంలో ఎన్ని సినిమాల్లో కనిపించినా రానీ క్రేజ్ ఈ ఒక్క వైరల్ వీడియోతో వచ్చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షాకింగా కామెంట్లు చేసింది. తనకు ఆ సినిమా అవకాశం ఎలా వచ్చిందో కూడా వివరించింది. తాను ఓ అబద్ధం చెప్పి మరీ హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు అనేక యాడ్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన బ్రహ్మోత్సవం సినిమాలో కనిపించింది. అలాగే ప్రేమమ్ సినిమాలో, పవన్ కల్యాణ్ హీరోగా చేసిన అజ్ఞాతవాసి చిత్రంలోనూ సందడి చేసింది. ఇలా ఎన్నెన్నో సినిమాలతో పాటు యాడ్స్ లో నటించిన అవంతిక హాలీవుడ్ కు వెళ్లిపోయింది. ముఖ్యంగా అక్కడ లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలే ఈ బుట్టబొమ్మ మీన్ గర్ల్ అనే ఓ సినిమాలో నటించగా దాని వల్లే ఈమె ట్రెండింగ్ లోకి వచ్చింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే వెబ్ సిరీస్ చేయగా.. అది అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా మార్చి 14వ తేదీన విడుదల అయింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఛాన్స్ తనకు ఎలా వచ్చిందో చెప్పింది. ముఖ్యంగా తాను హాలీవుడ్ లో టారోట్ అనే ఓ హర్రర్ సినిమా చేశానని.. అయితే ఆ సినిమా షూటింగ్ సెర్బియాలో జరుగుతుండగా... బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే వెబ్ సిరీస్ లో ఛాన్స్ వచ్చిందని చెప్పింది. అయితే తాను ఆ సినిమా పూర్తి చేసుకుని వచ్చే సరికి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని తెలిపింది.
అయితే ఈ వెబ్ సిరీస్ లో అవకాశం కోసం.. తనకు బాస్కెట్ బాల్ ఆడడం రాకపోయినా వచ్చని అబద్ధం చెప్పినట్లు వివరించింది. కానీ అక్కడకు వెళ్లాకా వాళ్లకు ఆ విషయం అర్థం అయిందని.. నెల రోజుల పాటు తనకు ఆ గేమ్ ఆడించి.. ఫుల్ గా ట్రైన్ చేశారని వెల్లడించింది. అయితే అందులో మొత్తం 8 మంది అమ్మాయిలు చేయగా.. తాను త్వరగానే వాళ్లతో కలిసిపోయి చక్కగా నటించగల్గానని పేర్కొంది. అలాగే తనకు ఇక్కడి కంటే హాలీవుడ్ లో సినిమాలు చేయడం అంటేనే ఇష్టం అని తెలిపింది.

అక్కడ కేవలం టాలెంట్ ఉంటేనే ఛాన్సులు ఇస్తారని.. కానీ ఇక్కడ పరిస్థితి వేరని వెల్లడించింది. తన మాతృభాష తెలుగే కావడం వల్ల తనకు ఇక్కడ సినిమాలు చేయాలని ఉంటుందని.. కానీ మంచి డైరెక్టర్, మంచి రోల్ లో నటించాలని మాత్రమే తాను ఆగుతున్నట్లు చెప్పింది. అలాగే తనకు సుకుమార్, రాజమౌళి, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు అంటే చాలా ఇష్టం అని వారితో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని పేర్కొంది. చూడాలి మరి హాలీవుడ్ లో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులోనూ మంచి సినిమాలు చేస్తుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











