అవికా గోర్‌కు క్రేజీ ఆఫర్.. మారుతి, సాయిధరమ్ తేజ్ చిత్రంలో ఛాన్స్!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు విజయాల బాట పట్టాడు. సుప్రీం చిత్రం తర్వాత వరుసగా 6 పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు బాగా తగ్గింది. ఒక్క హిట్ కోసం తేజు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ ప్రయత్నాలు ఫలించి చిత్రలహరి చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. దీనితో సాయిధరమ్ తేజ్ ఉత్సాహంగా తన కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం మారుతి దర్శకత్వంలో ఉండబోతోందంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన నటించే హీరోయిన్ కోసం మారుతి ప్రయత్నాలు ప్రారంభించాడట. ఉయ్యాలా జంపాలా ఫేమ్ అవికా గోర్‌ తో మారుతి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను సిద్ధం చేసుకున్న కథకు అవికా గోర్‌ అయితే బావుంటుందని మారుతి భావిస్తున్నారట.

Actress Avika Gor in talks for Sai Dharam Tej new film

త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన చేసి నటీనటుల్ని కూడా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X